BubbleGum: చిరుని ఇన్వాల్వ్ చేసినంత మాత్రాన హైపోస్తుందా?

టాలీవుడ్ లో ఈ మధ్య సినీ వారసత్వం తో వస్తున్న హీరో, హీరోయిన్లు ఎక్కువైపోయారన్న సంగతి తెలిసిందే. అయితే వాళ్లలో టాలెంట్ ఉన్న నటులే ఎక్కువ శాతం సక్సెస్ అవుతున్నారు. అది కూడా వాళ్ళ స్క్రిప్ట్ సెలక్షన్ టాలెంట్ ని బట్టి స్టార్ట్ స్టేటస్ ని దక్కించుకుంటారు. అంతే గాని బ్యాక్ గ్రౌండ్ అనేది ఎంట్రీ ఇవ్వడం వరకు మాత్రమే, ఆ తర్వాత రెండు మూడేళ్లు ఆడియన్స్ చూసి పక్కన పెట్టేస్తారు. అయితే ఇప్పుడు అలా బ్యాక్ గ్రౌండ్ తో వస్తున్న హీరో “రోషన్ కనకాల”.

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కొడుకు హీరోగా  “బబుల్ గమ్” అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు “రోషన్ కనకాల”. అయితే ఈ హీరో ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటినుండే రోషన్ పై లుక్స్ పరంగా చాలా ట్రోలింగ్స్ వచ్చాయి. పైగా ఆటిట్యూడ్ బిహేవియర్ అంత బాగాలేదని కొందరు నెటిజన్ల భావన. కానీ సుమ కనకాల చొరవ తో టాలీవుడ్ టాప్ హీరోలతో బబుల్ గమ్ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్.

ఫస్ట్ సాంగ్ ని విక్టరీ వెంకటేష్ చేత లాంచ్ చేయించగా, సెకండ్ సాంగ్ ని ఏకంగా మెగాస్టార్ చిరంజీవి చేతే లాంచ్ చేయించారు. ఇజ్జత్ అనే టైటిల్ తో రిలీజ్ చేసిన సాంగ్ వైరల్ అవుతుంది. అయితే మేకింగ్ పరంగా బాగున్నా కూడా, ఈ సినిమాకి హీరోనే మైనస్ అని సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అంతే కాదు చిరంజీవి తో ప్రమోట్ చేయించినంత మాత్రాన సినిమాకి హైప్ రాదు. సినిమాలో కంటెంట్ కూడా ఉండాలని నెటిజన్లు అంటున్నారు. మరి సినిమా ట్రైలర్ ద్వారా అయినా ఆ హైప్ వస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు