Adikeshava: ఇద్దరు డైరెక్టర్లు చేసేంతగా ఆ సినిమాలో ఏముంది?

పంజా వైష్ణవ్ తేజ్, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “ఆదికేశవ”. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 24న థియేటర్లలో సందడి చేయడానికి రెడీగా ఉంది. అయితే ఈ సినిమాకు శ్రీకాంత్ రెడ్డితో పాటు మరో డైరెక్టర్ కూడా పని చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ డైరెక్టర్ ఎవరు? అసలు ఆయన ఈ సినిమాలో ఏం చేశారు? అనే విషయాన్ని తాజాగా డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.

“ఆదికేశవ” మూవీని తను సరిగ్గా డైరెక్ట్ చేయడం లేదని నిర్మాత నాగవంశీ సుధీర్ వర్మ అనే మరో డైరెక్టర్ తో చేయించారని టాలీవుడ్ లో అంతా చెప్పుకుంటున్నారు. కానీ అందులో నిజం లేదు ఒక యాక్షన్ బ్లాక్ కోసం ఆయన్ని సెట్ కు పిలిపించుకుని, ఆయన సాయంతో ఆ యాక్షన్ పార్ట్ ను కంప్లీట్ చేశాను అంతే. కానీ చాలామంది సుధీర్ వర్మనే “ఆదికేశవ” సినిమాను డైరెక్ట్ చేశాడని ప్రచారం చేస్తున్నారు అంటూ దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఫిల్మీఫై టీంకి చెప్పుకొచ్చారు. దీంతో ఈ “ఆదికేశవ” మూవీ డైరెక్షన్ పగ్గాలను నాగవంశీ సుధీర్ వర్మ చేతిలో పెట్టారని, శ్రీకాంత్ రెడ్డిని పక్కకు పెట్టేశారని నడుస్తున్న టాక్ కు ఫుల్ స్టాప్ పడింది.

ఇక ఈ విషయం తెలిసిన నేటిజెన్లు ఇద్దరు డైరెక్టర్లు పని చేసేంతగా ఆ సినిమాలో ఏముంది? అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఈ సినిమాపై పెద్దగా హైప్ లేదు. ఇటీవల రిలీజైన ట్రైలర్ కు కూడా పెద్దగా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఏం లేదు. ప్రమోషన్స్ ను కూడా మేకర్స్ సైలెంట్ గానే కానిచ్చేశారు. మెగా కాంపౌండ్ గానీ, మెగా ఫ్యాన్స్ గానీ అసలు ‘ఆదికేశవ’ మూవీ రిలీజ్ కావట్లేదు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. కాగా ఇప్పటికే కొంతమంది సినీ ప్రముఖులకు ‘ఆదికేశవ’ మూవీ స్పెషల్ షోలు వేశారట.

- Advertisement -

దీంతో సినిమా ఎలా ఉందన్న టాక్ రిలీజ్ కాకముందే బయటకు వచ్చేసింది. ఫస్ట్ రివ్యూ ప్రకారం క్లైమాక్స్ 30 మినిట్స్ మినహా సినిమా అంతా బోర్ కొడుతుందని అంటున్నారు. అయితే కొంతమంది మాస్ ఆడియన్స్ కి నచ్చే అవకాశం ఉందని టాక్. మరి రేపు రాబోయే ఈ సినిమా ఎలా ఉందన్న విషయాన్ని ప్రేక్షకులే నిర్ణయించాలి. ‘ఆదికేశవ’ టీం అయితే మూవీ మాస్ ఫీస్ట్, ఖచ్చితంగా హిట్ అవుతుందన్న ధీమాతో ఉన్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు