Biggboss sivaji: ఇచ్చిన టాస్క్ లో శివన్న ఫెయిల్.. అందుకే కిల్లర్ ప్లేస్ లో మరో వ్యక్తి!

బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ వారం బిగ్ బాస్ స్వయంగా ఓ సీక్రెట్ టాస్క్ హౌస్ మేట్స్ అందరికి కలిపి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ టాస్క్ లో ఫస్ట్ ఎవరికీ వాళ్లకి సీక్రెట్ టాస్క్ లు ఇచ్చిన బిగ్ బాస్ ఆ తర్వాత ఆ టాస్క్ లో అందర్నీ ఇన్వాల్వ్ చేసాడు. బిగ్ బాస్ మిస్సెస్ మర్డర్ జరిగిందని మొదలైన ఈ టాస్క్ లో వరుస హత్యలు చేస్తున్నట్టు డ్రామా ప్లే చేసారు బిగ్ బాస్. అయితే ఈ డ్రామాలో కీ రోల్ ప్లే చేసిన శివాజీ ని కిల్లర్ గా అంబటి అర్జున్ గుర్తించడం జరిగింది.

అయితే ఈ టాస్క్ లో విలన్ శివాజీయే అసలు విలన్ అని అర్జున్ కనిపెట్టేయడం వల్ల శివాజీకి చెప్పి, ఆ తర్వాత నుండి చేయబోయే హత్యలు కిల్లర్ ప్లేస్ లో ఉండి ప్రియాంకని చేయమని బిగ్ బాస్ చెప్పాడం జరిగింది. అయితే ప్రియాంక ఈ మర్డర్ డ్రామా ఎక్కువ సేపు ప్లే చేయలేదని నెటిజన్లు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో ఇంతవరకు పెట్టిన టాస్క్ లలో ఇంట్రెస్ట్ లేని టాస్క్ ఇదేనని ఆడియన్స్ భావిస్తున్నారు. అయితే బిగ్ బాస్ ఈ టాస్క్ ని కెప్టెన్సీ టాస్క్ గా పెట్టారా, లేక ఈ టాస్క్ లో మరేదైనా బెనిఫిట్ ఉందా అన్నది రివీల్ చేయలేదు. ఏది ఏమైనా ఈ టాస్క్ ని మాత్రం తొందరగా ముగించాలన్నది బిగ్ బాస్ షో చూస్తున్న ఆడియన్స్ అభిప్రాయం. కానీ చూస్తుంటే ఎల్లుండి వరకు ఈ టాస్క్ కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు