Meter: ఈ సినిమా తోనైనా నిఖార్సయిన హిట్టు కొట్టగలడా?

టాలీవుడ్ లో ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి రాజావారు రాణివారు అనే చిన్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. మొదటి సినిమా పెద్దగా ఆడకపోయినా కూడా, తన టాలెంట్ నిరూపించుకోడానికి  ఎప్పటికప్పుడు తన సాయశక్తులా కృషి చేస్తున్నాడు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఎస్.ఆర్ కల్యాణ మండపం సినిమాకు తానే కథ, స్క్రీన్ ప్లే కూడా అందించాడు. ఆ సినిమా యావరేజ్ హిట్ అయింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలకు డైలాగులు ని అందించాడు. రీసెంట్ గా “వినరో భాగ్యము విష్ణు కథ” అంటూ వచ్చి ఒక యావరేజ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

అయితే ఇప్పుడు మీటర్ అనే మాస్ కమర్షియల్ సినిమా తో రేపు అనగా ఏప్రిల్ 7 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రమేష్ కదురి ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించగా, మైత్రి మూవీ మేకర్స్ సహా నిర్మాతలుగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సాయి కార్తీక్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుపుకున్న ఈ సినిమాకు రావాల్సిన హైప్ అయితే రాలేదు. 4.50 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. అదీ కాక ఏప్రిల్ 7 న విడుదలవుతున్న రవితేజ రావణాసుర సినిమాను తట్టుకొని ఈ సినిమా నిలబడగలదా ? అన్నది రేపు తెలుస్తుంది. కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేని కిరణ్ అబ్బవరం కు ఈ సారైనా ఒక నిఖార్సైన హిట్ వస్తుందా లేదా అన్నది చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు