Arya-3: సుకుమార్ తో విజయ్ దేవరకొండ…?

‘పుష్ప’ సినిమా ఇండియా వైడ్ గా సెన్సేషన్ అవడంతో బన్నీ అండ్ సుకుమార్ రేంజ్ ఒక్కసారిగా అమాంతం పెరిపోయింది. బి టౌన్ లో మన వాళ్ళ పేర్లు హాట్ టాపిక్ గా మారిపోయాయి. ప్రస్తుతం “పుష్ప ది రూల్ ” సినిమా లో బిజీగా ఉన్నఈ ఇద్దరు నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేస్తారా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే దర్శకుడు సుకుమార్ ఆ మధ్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండతో అని చెప్తూ ఒక పోస్టర్ కూడా రిలీస్ చేసారు.
కానీ అది పుష్ప కి ముందు చేసిన ప్రకటన.

ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా, ”లైగర్” విజయ్ ని నిరాశ పరచడంతో విజయ్ కెరీర్ ఒక్కసారిగా గాడి తప్పింది. మరో పక్క అందరు సింగల్ మూవీగా అనుకున్న పుష్ప రెండు పార్టులుగా చేస్తుండటంతో సుకుమార్,విజయ్ సినిమా గతంలో రిలీస్ చేసిన ఆ పోస్టర్ వరకే పరిమితం అయింది.

మరోపక్క సుకుమార్ చరణ్ కి కూడా స్టోరీ వినిపించాడు అని తెలియగానే ఇక అంతా సుకుమార్ విజయ్ కాంబో ఇప్పట్లో లేదు అని అనుకున్నారు. కానీ లెక్కల మాస్టర్ కాఫీ కప్ ని అటు తిప్పి ఇటు చేసిన మ్యాజిక్ కి అందరు షాక్ అవ్వక తప్పట్లేదు ఎందుకంటే విజయ్ , సుకుమార్ సినిమా తొందర్లోనే పట్టాలు ఎక్కనుంది. ప్రస్తుతం “పుష్ప ది రూల్ “లో బిజీగా ఉన్న సుకుమార్ డిసెంబర్ తర్వాత నుంచి విజయ్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీ అవనున్నాడు అనే న్యూస్ ఇండిస్టీలో గట్టిగ వినిపిస్తుంది.

- Advertisement -

విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి “అనే సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా ఐపోయాక సుకుమార్ విజయ్ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ రానుంది. పుష్ప మాస్ సినిమా ఫ్రాంచైస్ అవ్వడంతో సుకుమార్ మార్క్ లవ్ స్టోరీస్ నిఅందరు మిస్ అవుతున్నారు . అయితే సుకుమార్ విజయ్ తో చేయబోయేది ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని టాక్ వినిపిస్తోంది. అయన గతం లో చెప్పినట్టు ఆర్య -3 ని ప్లాన్ చేస్తున్నాడు అనేది సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు