Pawan Kalyan: గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న పవన్..!

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో గేమ్ చేంజర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇదిలా ఉండగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు ఈ సినిమా గురించి ముచ్చటిస్తూ ఒక ఇంట్రస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. అదేంటంటే, దర్శకుడు శంకర్ మొదట్లో గేమ్ చేంజర్ కథను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అనుకోని దిల్ రాజు వద్దకు వెళ్ళాడట. కథ విన్న దిల్ రాజు, ఈ స్టోరీ పవన్ కళ్యాణ్ కంటే కూడా రామ్ చరణ్ కు బాగా సెట్ అవుతుందని భావించి కథను రామ్ చరణ్ వినిపించాలని కోరగా ఫోన్లోనే శంకర్ కథ వినిపించారట.

ఆ సమయంలో RRR షూటింగ్లో ఉన్న రామ్ చరణ్ కథ విన్న వెంటనే ఓకే చెప్పటంతో ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ లాక్ అయ్యిందని చెప్పుకొచ్చారు దిల్ రాజు. ఈ విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ తమ హీరోకు గోల్డెన్ ఛాన్స్ మిస్సయిందని ఫీల్ అవుతున్నారు. నిజానికి పొలిటికల్ థ్రిల్లర్ అయిన ఈ స్టోరీ పవన్ కళ్యాణ్ కు వెళ్లుంటే ఎలక్షన్ టైమ్ లో కచ్చితంగా పొలిటికల్ గా ప్లస్ అయ్యుండేది. అయితే బాబాయికి వెళ్లాల్సిన సినిమా అబ్బాయికి వెళ్ళింది కానీ, మెగా కాంపౌండ్ దాటి వెళ్లలేదన్న భావనలో ఉన్నారట. దర్శకుడు శంకర్ సినిమా అంటే ఒక పట్టాన కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉండదు. అలాంటిది పొలిటికల్ గా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు కావాల్సినన్ని డేట్స్ ఇచ్చి ఉండేవాడా అన్నది కూడా డౌటే.

కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ డిఫరెంట్ లుక్స్ తో ఉన్న ఫోటోలు బయటికి రావటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. RRR తరువాత వస్తున్న రామ్ చరణ్ సినిమా కావటం డైరెక్టర్ శంకర్ భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరు కావటం వల్ల గేమ్ చేంజర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు