Divi Vadthya: నాకు చికెన్ అంటే చాలా ఇష్టం

బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయి తన అందంతో ప్రేక్షకులని ఆకట్టుకున్న దివి వద్థ్య కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ తరువాత మెగాస్టార్ చిరంజీవి తో ఓ సినిమాలో నటించి ఇంకా ఎక్కువ మందికి తెలిసింది. అప్పటి నుంచి ఈ భామ ఇంకా పాపులర్ అయ్యేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తూ, అందులో భాగంగా ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియా ద్వారా టచ్ లోనే ఉంది. తన అందాన్ని ఒలకబోస్తూ మంచి మంచి పోజులిచ్చి ఫోటోలను అప్లోడ్ చేస్తుంది.

ఇక సినిమాలో నటించే అవకాశాలు ఈ భామ తలుపు తట్టకపోవటంతో ఈ భామ మరో కొత్త పద్దతిలో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉంది. పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ఫంక్షన్లకి హాజరు అయి ప్రేక్షకులతో డైరెక్టుగా మాట్లాడుతూ మంచి అనుబంధాన్ని ఏర్పరచుకుంది. ఇక ఈ భామ ఇటీవల కొంపల్లి లోని సినీ ప్లానెట్ సమీపంలో ఏర్పాటైన బార్కాస్ ఇండో అరబిక్ రెస్టారెంట్ ఓపెనింగ్ ఫంక్షన్ కు ముఖ్య అతిధి గా విచ్చేసింది.

ఈ సందర్భంగా నటి దివి మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటేనే మనకు గుర్తొచ్చేది నోరూరించే రుచికరమైన వంటకాలు. దేశం లోని ఈశాన్య రాష్ట్రాల రుచికర వంటలు, ఇందుకు తగ్గా ఆహ్లాదకర వాతావరణం.. ఇండో అరబిక్ రెస్టారెంట్ మన హైదరాబాద్ కు తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. మండీ బిర్యానీ..కెబాబ్స్ ను రుచిచూడకుండ ఉండలేనన్నారమే. ఇక దివి ఇక్కడ కలవడిగా తిరుగుతూ, అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. లంబసింగి సినిమా వచ్చే నెలలో రిలీజ్ కానుందని, ఎంతో ఎక్సైట్ మెంట్ గా ఉందనన్నారు నటి దివి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు