Padma sri: పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్న టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు

టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి గురించి టాలీవుడ్ లో తెలియని వారుండరు. మనసు మమత అనే చిన్న చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిలిం ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన “సీతా రామయ్య గారి మనవరాలు” చిత్రం తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి నటించిన “ఘరానా మొగుడు” మూవీ ద్వారా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక వరసకు తమ్ముడైన ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్ట్ చేసే అన్ని సినిమాలకు ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు.

1997 లో రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చిన “అన్నమయ్య” సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఈయన నేషనల్ అవార్డు ని గెలుచుకున్న కీరవాణి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా “ఏడు ఫిలిం ఫేర్” అవార్డులను, 8 నంది అవార్డులను గెలుచుకున్నారు. అయితే రీసెంట్ గా టాలీవుడ్ ప్రైడ్ చిత్రం “రౌద్రం రణం రుధిరం (RRR)” సినిమాకి గాను సంగీత దర్శకుడు కీరవాణి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ లో ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నారు.

అయితే ఆస్కార్ ని భారత దేశానికి తీసుకొచ్చిన కీరవాణి కి గత కొన్నాళ్ల క్రితమే భారత ప్రభుత్వం ప్రఖ్యాత పద్మ పురస్కారాల్లో ఒకటయినటువంటి పద్మశ్రీ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన పద్మ పురస్కారాల వేడుకలో రాష్ట్రపతి భవన్ లో దేశ ప్రధాని నరేంద్రమోడీ, ఇతర ప్రముఖుల సమక్షంలో, “రాష్ట్రపతి ద్రౌపది ముర్ము” చేతుల మీదుగా పద్మ శ్రీ పురస్కారాన్ని కీరవాణి అందుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం కీరవాణి “హరిహర వీరమల్లు” చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు