Ravanasura: రెండు బ్లాక్ బస్టర్ ల తర్వాత కూడా ఇంతే బిజినెస్సా

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర. సుధీర వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మించాడు. సెన్సార్ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 7 న విడుదల అవుతుంది. ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్, పూజిత పొన్నాడ, ఫారియా అబ్దుల్లా, మేఘ ఆకాష్, దక్ష నాగర్కర్ హీరోయిన్లు గా నటించారు. సుశాంత్ ఈ సినిమాలో తొలిసారిగా విలన్ గా నటించాడు. ఇంకా జయరాం, హైపర్ ఆది, రావు రమేష్, మురళి శర్మ, తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

తాజాగా రావణాసుర బిజినెస్ వివరాలు బయటకు రావడం జరిగింది. ఈ సినిమా ఏరియాల వారీగా చూస్తే నైజాం 7కోట్లు, సీడెడ్ 3కోట్లు, ఆంధ్ర 10 కోట్లు, ఇంకా కర్ణాటక, ఓవర్సీస్ ఇతర ఏరియాలన్ని కలిపి 2.20 కోట్లు బిజినెస్ జరిగింది. టోటల్ గా 22. 20 కోట్ల బిజినెస్ జరగ్గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 23 కోట్లు వసూలు చెయ్యాలి.

అయితే రవితేజకు కొన్ని సంవత్సరాలుగా మీడియం హీరోల సినిమాలకి అయ్యే రేంజ్ బిజినెస్ కూడా జరగడం లేదన్నది వాస్తవం. ఎందుకంటే అప్పుడు రవితేజ సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయితే రీసెంట్ గా రవితేజ ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి, సంక్రాంతి కి చిరు తో కలిసి వాల్తేరు వీరయ్య తో కూడా మరో బ్లాక్ బస్టర్ మూవీ లో భాగమయ్యాడు. అయినా కూడా రావణాసుర సినిమా కి కేవలం 22 కోట్ల బిజినెస్ కావడం చర్చనీయాంశము అయింది. రవితేజ లాస్ట్ డిజాస్టర్ సినిమా ఖిలాడీ కి కూడా దీనికంటే 50 లక్షలు ఎక్కువే జరిగింది.

- Advertisement -

అయితే ఇలా కూడా అయ్యి ఉండవచ్చు రవితేజ కూడా ఈ సినిమా నిర్మాణం లో భాగస్వామి గా ఉన్నాడు. అందువల్ల బిజినెస్ లో కొన్ని ఏరియాలు అయన తక్కువ రేట్లకి తీసుకున్నాడు కాబోలు. ఏది ఏమైనా మాస్ మహారాజా స్థాయి కి జరగాల్సిన బిజినెస్ కాదు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు