Tollywood: సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల అన్నాచెల్లెళ్లుగా నటించిన సినిమా ఏదో తెలుసా..?

నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. సినిమాలలోకి అరంగేట్రం చేసిన తర్వాత దర్శకుడు ఆదుర్తి ఆయన పేరును కృష్ణగా మార్చారు. ఇక ఆయన ఫ్యామిలీ విషయానికి వస్తే కృష్ణకి ఇందిరాదేవితో మొదటి వివాహం జరగగా.. మరో అగ్ర హీరోయిన్ విజయనిర్మలను రెండో వివాహం చేసుకున్నాడు. తెలుగు చిత్ర సీమలో అత్యధిక చిత్రాలలో జంటగా నటించిన క్రెడిట్ కృష్ణ – విజయనిర్మలకే దక్కుతుంది. వీరిద్దరూ కలిసి 47 చిత్రాలలో జోడిగా నటించడం ఓ రికార్డు.

వీరిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం సాక్షి. ఈ సినిమాలో నటించిన తరువాతే కృష్ణ, విజయనిర్మల మధ్య అనురాగ బంధం పెనవేసుకుంది. అయితే వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. కృష్ణ, విజయనిర్మల అన్న చెల్లెళ్లుగా నటించిన సినిమాలు కూడా ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే.. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నాక, హీరో, హీరోయిన్లుగా నటించాక, ఆ తర్వాత మళ్లీ అన్నాచెల్లెళ్లుగా నటించారు. మూవీ మొగల్ దగ్గుబాటి రామానాయుడు నిర్మాతగా ఉన్న సమయంలో ” బొమ్మలు చెప్పిన కథ” అనే సినిమాని రూపొందించారు.

ఈ చిత్రం 1969 ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అప్పటి అగ్ర హీరోలు అందరూ నటించారు. ఇదే సినిమాలో కృష్ణ, విజయనిర్మల అన్నా చెల్లెళ్లుగా నటించారు. ఈ చిత్రంలో కృష్ణ పక్కన గీతాంజలి నటిస్తే.. విజయనిర్మల కాంతారావు పక్కన నటించింది. ఇవే కాకుండా.. కృష్ణ – విజయనిర్మల అన్నా చెల్లెళ్లుగా నటించిన మరో రెండు చిత్రాలు ఉన్నాయి. అవి మంచి మిత్రులు, ముహూర్త బలం. ఈ చిత్రాలలో కూడా కృష్ణ – విజయనిర్మల అన్నా చెల్లెళ్లుగా నటించారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు