PRABHAS: సలార్ వచ్చేస్తుంది. “ఎక్కించు హైప్ ఎక్కించు”

KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో ప్రభాస్ హీరో వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ సినిమా ‘సలార్ “  ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీటిలో మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఇదే. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా పై అటు ఫాన్స్ లో, ఇటు సినీఫిల్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. కె.జి.ఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న మూవీ అవ్వడంతో కె.జి.ఎఫ్ రేంజ్ మాస్ యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్ ఎలా ఉంటాడో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు .

‘సలార్’ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి ఇదిగో సలార్ లీకిడ్ పిక్ , అదిగో సలార్ లీకిడ్ వీడియో అంటూ ప్రభాస్ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. దాంతో ఫ్యాన్స్ ఎమోషన్స్ ని అర్థం చేసుకున్న మేకర్స్ కిందటి సారి కొన్ని పోస్టర్లను రిలీజ్ చేసారు. ప్రభాస్ కోరమీసా కట్టు, యాంగ్రీ లుక్ తో కూర్చొని ఉండే స్టిల్ చూసి ఫ్యాన్స్ “ఎక్కించు హైప్ ఎక్కించు” అనే మిమ్ తరహాలో పూనకాలతో ఊగిపోయారు. ఇక అప్పటి నుంచి ఫాన్స్ అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా . ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు .

అభిమానుల ఉత్సహాన్ని రెట్టింపు చేస్తూ నిన్న సాయంత్రం హోంబలే ఫిలిమ్స్ “సలార్” రిలీజ్ డేట్ ని మెన్షన్ చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. రెబెల్ మోడ్ ఆన్ సెప్టెంబర్ 28 ,2023, అని పోస్ట్ చేసింది. ఆ వీడియోతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్డేట్ ఇచ్చినందుకు మేకర్స్ కి ‘థాంక్స్’ చెబుతూ కామెంట్స్ బాక్స్ ని నింపేశారు డార్లింగ్ అభిమానులు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు