National Crush: స్టార్ డైరెక్టర్ దెబ్బకు నెంబర్ బ్లాక్ చేసిన రష్మిక మందన్న!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఈ భామకు సూపర్ క్రేజ్ ఉంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమె అతి తక్కువ సమయంలోనే ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్తోంది. ఒక్కో సినిమాకి దాదాపు 5 కోట్ల పారితోషికం తీసుకుంటూ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది రష్మిక. ఏప్రిల్ 5న ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు కావడంతో పుష్ప – 2 టీమ్ కూడా ఆ సినిమాలో ఈమెకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ని విడుదల చేశారు.

అలాగే పుట్టినరోజు సందర్భంగా రష్మిక కు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తనకు సినిమా అవకాశాలు ఎలా వచ్చాయనే విషయాల గురించి చెప్పినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. గతంలో సినీరంగంలో ఎంట్రీ పై రష్మిక చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఏంటంటే.. తన కెరీర్ స్టార్టింగ్ లో రష్మికకు ఓ స్టార్ డైరెక్టర్ కాల్ చేశాడట. అయితే మొదట అది ప్రాంక్ కాల్ అనుకుందట రష్మిక. అందుకే తనకి సినిమాలో నటించే ఇంట్రెస్ట్ లేదు అంటూ ఫోన్ కట్ చేశానని చెప్పుకొచ్చింది. అయితే పదే పదే ఆ డైరెక్టర్ కాల్ చేయడంతో విసుగు చెందిన రష్మిక ఆ స్టార్ డైరెక్టర్ నెంబర్ ని బ్లాక్ లిస్టులో పెట్టిందట.

అప్పటివరకు ఆయన స్టార్ డైరెక్టర్ అన్న సంగతి కూడా రష్మికకు తెలియదట. ఆ తరువాత తన స్నేహితుల ద్వారా ట్రై చేసినా రష్మిక రెస్పాండ్ కాకపోవడంతో ఏకంగా క్లాస్ టీచర్ ని రంగంలోకి దింపాడట ఆ డైరెక్టర్. అయితే తనకి నటించడం రాదని చెప్పగానే వాళ్ళు తనతో కొన్ని డైలాగులు రికార్డు చేసి ఆ తర్వాత తనని వారి సినిమా కోసం ఎంపిక చేశారు అంటూ తన మొదటి సినిమాకి వచ్చిన అవకాశం గురించి రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు