Tollywood Directors: అందుకే బాలీవుడ్ హీరోలతో సినిమాలు చెయ్యరా..?

Tollywood Directors: ఒకప్పుడు బాలీవుడ్ సినీ పరిశ్రమకి టాలీవుడ్ సినీ పరిశ్రమను ఎంత చీప్ గా చూసేవారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే రాజమౌళి పుణ్యమా అని ఇప్పుడు బాలీవుడ్ కూడా టాలీవుడ్ కోసం ఎదురుచూసే క్షణాలు వచ్చేసాయి.. ప్రస్తుతం మంచి మంచి కథలతో మన టాలీవుడ్ డైరెక్టర్లు, హీరోలు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటే ఇప్పుడు బాలీవుడ్ హీరోలకు , డైరెక్టర్లకు అసూయ ఏర్పడింది..అందుకే తాము కూడా ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం కోసం… బాలీవుడ్ డైరెక్టర్లు టాలీవుడ్ హీరోల కోసం.. అలాగే బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ డైరెక్టర్ల కోసం ఎదురు చూస్తున్నారు అయితే సినీ ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి కూడా వస్తుందని ఎవరు ఊహించలేదేమో. దీనంతటికీ కారణం మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లని చెప్పవచ్చు.

ఇక తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటే సుకుమార్, సందీప్ రెడ్డివంగా తర్వాత స్థానాలలో ఉన్నారు. నిజానికి వీరు ముగ్గురు కలిసి తెలుగు సినిమాని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు.. అంతేకాదు ఇండియాలోనే స్టార్ డైరెక్టర్లుగా కూడా గుర్తింపు పొందుతున్నారు. అందుకే వీళ్ళతో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి హీరో కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగానే రీసెంట్ గా సందీప్ రెడ్డి యానిమల్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నారు.

దీంతో బాలీవుడ్ హీరోలు సందీప్ సినిమా చేయాలని చూస్తుండడం గమనార్హం. అయితే ఆయన మాత్రం ప్రభాస్ తో ఇప్పుడు స్పిరిట్ సినిమాని మొదలుపెట్టారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి కమిట్ అయ్యారు.

- Advertisement -

ఈ క్రమంలోని మన దర్శకులు బాలీవుడ్ హీరోలను పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంటి ? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మన దగ్గరే మల్టీ టాలెంటెడ్ కలిగిన స్టార్ హీరోలు ఉన్నప్పుడు ఇతర భాషల హీరోలతో అవసరం ఏముంది..? అందుకే మన స్టార్ డైరెక్టర్లు బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి కనబరుచలేదని సమాచారం.. అందుకే రాజమౌళి, సుకుమార్ లాంటి డైరెక్టర్లు కూడా బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడం లేదు.

ఇక సందీప్ వంగ యానిమల్ సినిమా కోసం రణబీర్ కపూర్ ను తీసుకున్నారు. అయితే ఈ కథ మొదట మహేష్ బాబుతో చేయాలనుకోగా ఆయన రిజెక్ట్ చేస్తే అప్పుడు రణబీర్ ని తీసుకున్నారే తప్పా.. ఒకవేళ మహేష్ బాబు చేసి ఉండి ఉంటే రణబీర్ దగ్గరికి ఈ కథ వెళ్ళేది కాదు ఒకప్పుడు మనల్ని పట్టించుకోని బాలీవుడ్ హీరోలు ఇప్పుడు మన డైరెక్టర్ల కోసం ఎదురు చూడడం అనేది నిజంగా ఇది అద్భుతమైన ఘట్టం అని చెప్పవచ్చు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు