NBK109: మహాశివరాత్రి కానుక సిద్ధం

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రొడక్షన్స్ లో చాలా అగ్రెసివ్ గా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్న ఒక సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్. అయితే ఈ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయని చెప్పవచ్చు. జెర్సీ లాంటి నేషనల్ అవార్డు సాధించిన సినిమా కూడా ఈ బ్యానర్ లోనే వచ్చింది. అయితే ఈ బ్యానర్ కంటే ముందు హారిక హాసిని అనే బ్యానర్ లో త్రివిక్రమ్ దర్శకుడుగా రాధాకృష్ణ సినిమాలు నిర్మిస్తూ ఉండేవారు. ఇప్పటికీ ఆ బ్యానర్ లో కేవలం త్రివిక్రమ్ మాత్రమే సినిమాలు చేస్తారు. అయితే ఆ బ్యానర్ కి అనుసంధానంగా ఈ బ్యానర్ ను స్థాపించారు.

ఈ బ్యానర్లో నాగ వంశీ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. నాగ వంశీ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ వైఫ్ కూడా కొన్ని సినిమాలకి భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇదివరకే ఈ బ్యానర్లో వచ్చిన కొన్ని సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఈ బ్యానర్ లో వచ్చిన డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమా రాబోతుంది.

ఇకపోతే ఈ బ్యానర్లు మరో సంచలనం సృష్టించిన సినిమా మ్యాడ్. కళ్యాణ్ శంకర్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ఈ సినిమాను నిర్మించాడు నాగ వంశీ. అయితే ఈ సినిమా కూడా థియేటర్ వద్ద నవ్వులు పువ్వులు పూయించి మంచి కలెక్షన్స్ రాబెట్టింది. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ గా మ్యాడ్ మాక్స్ అనే సినిమా రాబోతుంది. ఇకపోతే ఈ ప్రొడక్షన్స్ లో ప్రస్తుతం బాబి బాలకృష్ణ కాంబినేషన్లో ఒక సినిమా జరుగుతుంది. దీంతోపాటు వెంకీ అట్లూరి దుల్కర్ సల్మాన్ సినిమా కూడా ఇదే బ్యానర్ లో జరుగుతుంది.

- Advertisement -

ఈ బ్యానర్ లో నిర్మితమవుతున్న టిల్లు స్క్వేర్ సినిమా ఈ మంత్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం ఇదివరకే టిల్లు సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతోనే సిద్దు జొన్నలగడ్డ కి మంచి పేరు కూడా వచ్చింది. కంప్లీట్ అవుటెండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే చాలామంది టిల్లు స్క్వేర్ సినిమా కోసం చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ బ్యానర్లో నిర్మితమవుతున్న ఇంకో సినిమా Nbk109. బాబి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాతో బాబి మంచి హిట్టు అందుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో బాలకృష్ణ చేసిన సినిమాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి మంచి హిట్ అనిపించుకున్నాయి. అఖండ ఆ తర్వాత చేసిన వీర సింహారెడ్డి రీసెంట్గా చేసిన భగవంత్ కేసరి ఈ సినిమాలన్నీ కూడా హ్యాట్రిక్ విజయాలని నమోదు చేసుకున్నాయి. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే బాబీ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా గ్లిమ్స్ ను మహాశివరాత్రి కానుక రేపు రిలీజ్ అయినట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు