OTT Movies : ఈవారం ఓటిటీలోకి రాబోతున్న టాప్ మూవీస్ ఇవే

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటిటీలో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. ఈసారి శివరాత్రి కూడా కలిసి రావడంతో ఈ లాంగ్ వీకెండ్ ను ఓటిటిలోని సినిమాలు చూసి ఎంజాయ్ చేయడానికి తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. శివరాత్రి కానుకగా పలు మోస్ట్ అవెయిటింగ్ సినిమాలు ఓటిటీలోకి అందుబాటులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ ఆడియన్స్ అంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న “హనుమాన్” మూవీ ఎట్టకేలకు స్ట్రీమింగ్ కాబోతోంది. అలాగే మహారాణి 3, షో టైం వంటి వెబ్ సిరీస్ లతో పాటు మెర్రీ క్రిస్మస్, లాల్ సలాం వంటి ప్లాప్ మూవీలు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఈ వీకెండ్ ఓటిటిలో చూడడానికి అందుబాటులో ఉండే ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. హనుమాన్
మోస్ట్ అవెయిటింగ్ మూవీ “హనుమాన్” మరికొన్ని గంటలోనే అంటే గురువారం అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కాబోతోంది. జీ5లో ఈ మూవీ మార్చ్ 8న అర్ధరాత్రి 12 తర్వాత నుంచి అందుబాటులోకి రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 300లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి, 90 ఏళ్ల టాలీవుడ్ చరిత్రను తిరగ రాసిన “హనుమాన్” మూవీనీ హ్యాపీగా శివరాత్రి సందర్భంగా చూసేయొచ్చు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయింది. “హనుమాన్”తో పాటు రిలీజ్ అయిన పలువురు స్టార్ హీరోల సినిమాలు ఇప్పటికే ఓటీటీలో వచ్చేసాయి. అయితే ఆ సినిమాలు వారం రోజులు కూడా థియేటర్లలో నిలదొక్కుకోలేకపోయాయి. కానీ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ తో పోలిస్తే “హనుమాన్” చాలా రోజుల వరకు థియేటర్లలో ఆడింది.

2. మెర్రీ క్రిస్మస్
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ఫస్ట్ టైం కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న మూవీ “మెర్రీ క్రిస్మస్”. ఈ థ్రిల్లర్ మూవీకి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు “మెర్రీ క్రిస్మస్” నెట్ ఫ్లిక్స్ లో మార్చ్ 8 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

- Advertisement -

3. మహారాణి 3
మహారాణి వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే రెండు సీజన్లు రిలీజ్ అయిన ఈ పొలిటికల్ డ్రామా ఇప్పుడు మూడో సీజన్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. మార్చ్ 7 నుంచి సోనీ లివ్ ఓటీటిలో “మహారాణి 3” స్ట్రీమింగ్ అవుతోంది.

4. షో టైం
ఇమ్రాన్ హష్మీ, మౌని రాయ్, నసిరుద్దీన్ షా వంటి బాలీవుడ్ ప్రముఖులు నటించిన వెబ్ సిరీస్ “షో టైం”. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మార్చి 8 నుంచి ప్రసారం కానుంది.

5. అన్వేషిప్పిన్ కందేతుమ్
టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళ మిస్టరీ థ్రిల్లర్ “అన్వేషిప్పిన్ కందేతుమ్”. ఈ హిట్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ మార్చ్ 8న రిలీజ్ కాబోతోంది. ఓటిటిలో కూడా దుమ్ము దులపడానికి రెడీగా ఉంది ఈ మలయాళ మూవీ.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు