Bhimaa : డైరెక్టర్ హర్ష లో ఇంత టాలెంట్ ఉందా?

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన “భీమా” సినిమా ఫైనల్ గా మార్చి 8న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాను కన్నడ స్టార్ డైరెక్టర్ హర్ష దర్శకత్వం వహించగా, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధా మోహన్ నిర్మించడం జరిగింది. ఇక చాలా కాలం నుంచి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో గోపీచంద్ “భీమా”తో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడు. ఇక గోపీచంద్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడన్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు గోపీచంద్ పోలీస్ గా నటించిన సినిమాలన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి. ఇక భీమా సినిమా మాత్రం పోలీస్ ఆక్షన్ డ్రామాయే అయినా ఈ సినిమాకి సోషియో ఫాంటసీ ఫిక్షనల్ టచ్ కూడా ఇచ్చారు. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక భీమా పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

డైరెక్టర్ హర్ష కన్నడలో..

ఇక భీమా సినిమాను కన్నడ స్టార్ డైరెక్టర్ హర్ష దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈయన గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి పెద్దగా తేలికపోవచ్చు. తెలుగులో భీమా మొదటి సినిమా కాగా, కన్నడ ఇండస్ట్రీ అయిన శాండల్ వుడ్ లో మాత్రం స్టార్ డైరెక్టర్. అక్కడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోతో వేద, వజ్రకాయ, భజరంగీ వంటి పలు సూపర్ హిట్ సినిమాలను రూపొందించాడు. అలాగే పునీత్ రాజ్ కుమార్ తో అంజనీపుత్ర బ్లాక్ బస్టర్ సినిమాను డైరెక్ట్ చేసాడు. చివరగా ఈ దర్శకుడు రెండేళ్ల కింద వేద సినిమా చేయగా, తాజాగా “భీమా” సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

- Advertisement -

మల్టీ టాలెంటెడ్..

కన్నడ లో స్టార్ డైరెక్టర్ అయిన హర్ష దర్శకుడు కాకముందు ఒక ఫేమస్ డాన్స్ కోరియోగ్రాఫర్ కూడా. పునీత్ రాజ్ కుమార్, దర్శన్, కిచ్చ సుదీప్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు డాన్స్ మాస్టర్ గా పని చేసాడు. డైరెక్టర్ కాకముంద హర్ష దాదాపు 200 సినిమాలకి పైగా డాన్స్ మాస్టర్ గా పనిచేసాడు. ఇక తెలుగులో కూడా హర్ష మాస్ మహారాజ్ రవితేజ నటించిన బెంగాల్ టైగర్ సినిమాలో కూడా కొన్ని పాటలకు కొరియోగ్రఫీ చేయడం జరిగింది. ఇక దర్శకుడిగా మారాక కూడా కొన్ని సినిమాలకి డాన్స్ మాస్టర్ గా పనిచేసాడు హర్ష. అయితే ప్రస్తుతం మాత్రం ఏ సినిమాలకి చెయ్యట్లేదు. అంతే గాక కాశి ఫ్రమ్ విలేజ్, జాక్ పాట్ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించాడు హర్ష.

ఇక దర్శకుడుగా హర్ష కన్నడ లో ఇప్పటికే ప్రూవ్ చేసుకోగా, ఇప్పుడు తెలుగులో భీమా సినిమా ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నాడు. ఇక భీమా లో గోపీచంద్ సరసన ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించగా, కేజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అడ్వాన్సు బుకింగ్ కూడా స్టార్ట్ అయ్యాయి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు