Bhramayugam : ఒటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మెగాస్టార్ మూవీ..

మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి హీరోగా నటించిన నటించిన తాజా చిత్రం “భ్రమయుగం” భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా మలయాళం లో దూసుకుపోతుంది. అయితే గత నెల ఫిబ్రవరి లోనే మమ్ముట్టి హీరోగా నటించిన రెండు చిత్రాలు వచ్చాయి. అందులో తెలుగులో వైఎస్సార్ బయోపిక్ గా “యాత్ర 2” రిలీజ్ అవగా, ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఇక ఈ సినిమా కేవలం ఎలక్షన్స్ కోసమే తీసిన సినిమా అని అందరి అభిప్రాయం. ఇక మలయాళం లో “భ్రమయుగం” సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నటించడం జరిగింది. ఇక ఫిబ్రవరి 15న మలయాళంలో థియేటర్లలో రిలీజ్ అవగా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.మలయాళ దర్శకుడు రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియెన్స్ కి ఒక డిఫరెంట్ ట్రీట్ ని ఇవ్వగా మళయాళంలో బ్లాక్ బస్టర్ టాక్ తో 80 కోట్ల భారీ వసూళ్లు సాధించింది.

తెలుగులో ప్లాప్? మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన మమ్మూట్టి భ్రమయుగం సినిమాని తెలుగులో ఫిబ్రవరి 23న రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా తెలుగులో టాక్ పరంగా డీసెంట్ అనిపించుకున్నా రిజల్ట్ మాత్రం ప్లాప్ అనే చెప్పాలి. ఇతర సినిమాల పోటీ వల్ల ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. ఇక పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం వల్ల థియేటర్లలో నుండి తొందరగా తీసేసారు. అయితే మలయాళంలో మాత్రం ఇప్పటికి బాగా ఆడుతుంది .

ఓటిటి రిలీజ్ ఫిక్స్..

- Advertisement -

ఇక మలయాళంలో ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయిన భ్రమయుగం ఇక ఓటిటి రిలీజ్ కి సిద్ధమైంది. అక్కడక్కడా థియేటర్లో ఆడుతున్నా ఫైనల్ గా థియేటర్స్ నుంచి ఓటిటి లో వచ్చేందుకు సిద్ధమైంది.ఇక భ్రమయుగం సినిమా ఓటిటి స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ డిజిటల్ సంస్థ సోని లివ్ వారు సొంతం చేసుకోగా, ఇప్పుడు అఫీషియల్ గా భ్రమయుగం చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఇక భ్రమయుగం ఈ మార్చ్ 15న మళయాళం సహా తెలుగు మరియు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.ఇక తెలుగులో థియేటర్ల లోంచి తొందరగా వెళ్లిపోయిందనుకు మిస్ అయిన తెలుగు ఆడియన్స్ కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. మరి ఈ సినిమాని ఓటిటిలో చూడాలి అనుకునేవారు మరికొన్ని రోజులు ఆగితే సరిపోతుంది. ఇక ఈ చిత్రానికి క్రిస్టో జావియర్ సంగీతం అందించగా వై నాట్ స్టూడియోస్ మరియు నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఎల్ ఎల్ పి వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు