Gaami : 40 నిమిషాలు కోసం నాలుగేళ్ళు చేసాడా.?

ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ నేడు ఎక్కడెక్కడో పాకింది. దీనికి మెయిన్ రీజన్ ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ప్రస్తావని తీసుకొస్తే బాహుబలి సినిమాకు ముందు బాహుబలి సినిమా తర్వాత అని మాట్లాడుతారు. బాహుబలి సినిమా తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచింది. ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమాను తీసుకెళ్లి శిఖరం మీద కూర్చోబెట్టాడు.

ఒక కథను సినిమాగా మలిచి దానిని వెండితెరపై ఆవిష్కరించడానికి ఎస్.ఎస్ రాజమౌళి తీసుకుని టైం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత అదే డేట్ కి రాజమౌళి సినిమాలు రిలీజ్ అయిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే తను తీసే సినిమాతో ముందు తను సాటిస్ఫై అయితే గాని ఆ సినిమాను ప్రేక్షకులకు విడుదల చేయడు రాజమౌళి.

సంవత్సరాలు తరబడి సినిమాను చెక్కుతూనే ఉంటాడు కాబట్టి రాజమౌళిని జక్కన్న అని అంటారు. ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గత ఆరేళ్లుగా ఒక సినిమా తెరకెక్కుతుంది. అదే విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన గామి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాకి వాళ్ళు కష్టపడిన కష్టం మాటల్లో చెప్పలేనిది. రియల్ లొకేషన్స్ లో ఈ సినిమాని షూట్ చేశారు. గత ఆరేళ్లుగా ఈ సినిమా పైనే కూర్చుంది మూవీ టీం మొత్తం. అయితే ఈ సినిమా శివరాత్రి కానుకగా మార్చి 8న ప్రేక్షకులు ముందుకు రానుంది.

- Advertisement -

ఈ సినిమాలో విశ్వక్సేన్ శంకర్ అనే అఘోర పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో విశ్వక్సేన్ కేవలం 40 నుంచి 45 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడని సమాచారం వినిపిస్తుంది.విశ్వక్సేన్ ఈ సినిమా కోసం దాదాపు గత నాలుగుగేళ్లుగా కష్టపడుతున్నాడు. దీనితో పాటు వేరే ప్రాజెక్ట్స్ చేస్తూ ఈ సినిమా కూడా డేట్స్ ను కేటాయిస్తూ వచ్చాడు విశ్వక్. అయితే ఒక యాక్టర్ ఒక సినిమా కోసం ఇన్ని రోజులు కేటాయించడం అనేది మామూలు విషయం కాదు.

ఇకపోతే కేవలం 40 నిమిషాలు మాత్రమే కనిపించే ఈ పాత్రకి విశ్వక్సేన్ దాదాపు నాలుగేళ్లు కేటాయించాడు అంటే ఈ సినిమా పైన అందరికీ క్యూరియాసిటీ పెరుగుతుంది. అంటే ఆ పాత్రకి ఎంతటి ప్రాముఖ్యత ఉందో అని చాలామంది ఆలోచనలో పడ్డారు. కొన్ని సినిమాలు చేసినవి చిన్న పాత్రలైనా కూడా అవి మంచి ఇంపాక్ట్ ని చూపిస్తాయి. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో నాని పాత్ర నిడివి చాలా చిన్నది. కానీ సినిమా మొత్తం నానియే హీరో అనిపిస్తుంది.

ఇకపోతే ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ లో విశ్వక్సేన్ మల్టీ టాలెంటెడ్ యంగ్ హీరో అని చెప్పొచ్చు. వెళ్ళిపోమాకే సినిమాతో పరిచయమైన విశ్వక్సేన్ తర్వాత తన కెరియర్ లో డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడుగా కూడా తనలోని ప్రతిభను బయటకు తీసి సక్సెస్ అయ్యాడు విశ్వక్సేన్. ఇకపోతే ఇప్పటివరకు విశ్వక్సేన్ లో ఈ పర్ఫామెన్స్ టాప్ లెవెల్ అని చెప్పడానికి ఏదీ లేదు. బహుశా గామి సినిమాలో అలా చెప్పే ఆస్కారం ఉందని చాలామంది అభిప్రాయం.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు