Katrina Kaif: బాలీవుడ్‌ నటులతో కత్రీనా కైఫ్ విభేదాలు… అందరికీ దూరంగానే

బాలీవుడ్‌లో కత్రీనా కైఫ్‌కు సపరేట్ స్థానం ఉంటుంది. ఒక బాలీవుడ్ లోనే కాదు, సౌత్‌లోనూ మంచి పేరు ఉంది ఆమెకు. తెలుగులో హీరోయిన్ ను ఉద్ధేశిస్తూ… కత్రీనా కైఫ్ వా.. అంటూ రవితేజ ఓ సాంగ్ కూడా పడాడు. అంటే తెలుగులో కూడా కత్రీనా కైఫ్‌కు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కత్రీనా కైఫ్ కెరీర్ కొంత వరకు స్లోగా ఉంది. గతంలో ఏడాది కనీసం మూడు సినిమాలు చేసే కత్రీనా ఇప్పుడు కేవలం ఏడాది ఒక్క సినిమానే చేస్తూంది.

విక్కీ కౌశల్‌తో పెళ్లి తర్వాత…
బాలీవుడ్‌లో తోటి నటుడు విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత, కత్రీనా స్పీడ్ మొత్తం తగ్గింది. పెళ్లి అయిన తర్వాతే ఏడాది ఒక సినిమా చొప్పున చేస్తుంది. ఇటీవల సల్మాన్ ఖాన్‌తో టైగర్ 3 అనే సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించింది. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ, రీసెంట్ అనంత్ అంబానీ – రాధిక ల పెళ్లి ఈవెంట్ తర్వాత కత్రీనా కైఫ్ గురించి ఓ టాక్ వైరల్ అవుతుంది.

అనంత్ అంబానీ రాధికా మార్చెంట్ పెళ్లి…
అనంత్ అంబానీ రాధికా మార్చెంట్ పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. ఇండియాలోనే సెలబ్రెటీలు మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా సెలబ్రెటీలు అతిథులు గా వచ్చారు. అయితే ఈ ఈవెంట్ కి కత్రీనా కైఫ్ కూడా వచ్చింది. ఆమె భర్త విక్కీ కౌశల్ తో కత్రీనా కైఫ్ అనంత్ అంబానీ రాధికా మార్చెంట్ ప్రీ వెడ్డింగ్ కి వెళ్లింది.

- Advertisement -

అక్కడ సెలబ్రెటీలు అందరూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటే, కత్రీనా కైఫ్ మాత్రం తన భర్తని వదిలి వెళ్లలేదు. ఎప్పుడు భర్తతోనే ఉంది. తిరిగి వెళ్లే టైంలో కూడా ఇద్దరు మాత్రమే కనిపించారు. మొత్తం ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో కత్రీనా ఇతర సెలబ్రెటీలతో మాట్లాడం కానీ, కలిసి ఉండటం కానీ చేయలేదని తెలుస్తుంది.

దీంతో బాలీవుడ్ లో ఉన్న అందరి సెలబ్రెటీలతో కత్రీనాకు మధ్య విబేధాలు వచ్చాయా? అనే టాక్ వస్తుంది. కత్రీనా చివరి సారిగా సల్మాన్ ఖాన్ తో టైగర్ 3 చేసింది. ఈ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడు. అంతే కాదు, సల్మాన్ ఖాన్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ కూడా చేశాడు. కత్రీనా కనీసం సల్మాన్ ఖాన్ తో కూడా కలిసి మాట్లాడలేదు. దీంతో బాలీవుడ్ నటీనటులకు కత్రీనా కైఫ్ కు మధ్య చేడిందని, అందుకే అందరినీ దూరంగా ఉంది అని నెటిజన్లు అంటున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు