NBK109: బడ్జెట్ లెక్క దాటిపోతుందా?

Bobby

నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బాబీ కాంబో లో ఓ సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. బాలకృష్ణ 109 వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటరైన్మెంట్స్, ఫోర్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ లాస్ట్ ఇయర్ ప్రారంభమైనా, బాలయ్య పాలిటిక్స్ బిజీ వల్ల కొంత కాలం గ్యాప్ వచ్చింది. అయితే తిరిగి సంక్రాంతి ముగిశాక మళ్ళీ షూటింగ్ మొదలైంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అనిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు.

ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరగగా, ఆ షెడ్యూల్ ముగిశాక బాలయ్య తదుపరి షెడ్యూల్ కి మరికొంతకాలం గ్యాప్ ఇవ్వనున్నాడట. ఇదిలా ఉండగా ఈ సినిమా యొక్క బడ్జెట్ పరిమితి దాటిపోతుందని, లేట్ అయ్యేకొద్దీ మరో 20 శాతం ఎక్కువ అయ్యే పరిస్థితి వస్తుందని టాక్ నడుస్తుంది. పైగా ఈ సినిమాలో బాబీ డియోల్ రీసెంట్ గానే ఫిక్స్ అయ్యాడు. ఇక తనకు కూడా రెమ్యూనరేషన్ బాగానే మూట చెప్పాల్సి వస్తుంది. మామూలుగా సినిమా స్టార్ట్ అయ్యేటపుడు బడ్జెట్ 60 కోట్లు లెక్కేయగా, ఇప్పుడు 80 కోట్ల పరిధి దాటి 90 కోట్లు అయ్యేలా ఉందని చిత్ర యూనిట్ నుండి వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

నిర్మాత నాగవంశీ కూడా ఈ విషయంపై అసహనం వ్యక్తం చేస్తున్నాడని సమాచారం. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు గాని, బాలయ్య సినిమా బడ్జెట్ లెక్కలు దాటిందంటే అది కష్టమే, రీసెంట్ గా మంచి హిట్లే కొట్టినా, మార్కెట్ పరంగా 80 కోట్ల బడ్జెట్ దాటిందంటే బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరగాలి. అయితే కంటెంట్ బాగుంటే పెద్ద కష్టమేమి కాదు గాని, బాలయ్య సినిమాలకు నెగిటివ్ టాక్ వస్తే ఎంత ఘోరంగా ప్లాప్ అవుతాయో తెలిసిందే. అందుకే బడ్జెట్ లిమిట్ క్రాస్ చేయకుండా ఎలాగోలా, మ్యానేజ్ చేయాలని బాబీని కూడా సెట్స్ విషయంలో కేరింగ్ గా ఉండమని నాగవంశీ చెప్పినట్టు సమాచారం. ఏది ఏమైనా ఈ సినిమా కంటెంట్ పై ఒక ఐడియా రావాలంటే టీజర్ వస్తే గాని చెప్పలేం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు