Sandeep kishan: జీతం ఇవ్వలేక అలాంటి పని చేస్తున్న సందీప్ కిషన్..!

Sandeep kishan

చాలామంది సామాన్యులు.. సెలబ్రిటీలు అంటే కచ్చితంగా లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తుంటారని అనుకుంటూ ఉంటారు.. కానీ అలాంటిదేమీ ఉండదు వారికి కూడా అప్పులు, ఇబ్బందులు అనేవి ఉంటాయని చాలామంది నటీనటులు ఇప్పటివరకు తెలియజేశారు. ఇప్పుడు తాజాగా కుర్ర హీరో సందీప్ కిషన్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారని అభిమానులే అనుకుంటున్నారు మొదటిసారి సందీప్ కిషన్ తాను ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పడంతో ఈ విషయం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

సాధారణంగా ఒక కుర్ర హీరో తన సినిమాలతో పాటు ఇతర హీరోలలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు అంటే అందుకు కారణాలు చాలా ఉంటాయి.. ఒకటి ఆ హీరోలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల.. రెండవది కథ బాగా నచ్చడం వల్ల.. మూడవది ఆర్థిక పరిస్థితి దిగజారినప్పుడు ఇలాంటి సందర్భాలలో నటిస్తూ ఉంటారు..ఇప్పుడు సందీప్ కిషన్ కూడా డబ్బులు లేకనే గెస్ట్ రోల్ లో చేస్తున్నానంటూ స్వయంగా తెలియజేశారు.. ప్రస్తుతం సందీప్ కిషన్ నటించిన ఊరి పేరు భైరవకోన అనే సినిమా ఫిబ్రవరి 16న థియేటర్లో చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది.

ఫాంటసీ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి వీ.ఐ. ఆనంద్ దర్శకత్వం వహించారు.. విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ చిత్ర బృందం ప్రమోషన్స్ లో శరవేగంగా పాల్గొని సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే సందీప్ కిషన్ కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.. తాను సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నది కేవలం డబ్బులు కోసమే అని.. గత కొంతకాలంగా తాను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను అంటూ తెలిపారు..

- Advertisement -

సినిమాలే కాకుండా హోటల్ బిజినెస్ లో కూడా పెట్టుబడి పెట్టాను.. వారందరికీ జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది.. వారికి జీతాలు ఇవ్వడానికే తాను సినిమాలలో చేస్తున్నానంటూ అలాగే పలు సినిమాలలో గెస్ట్ రోల్ కూడా చేస్తున్నానంటూ తెలియజేశారు. ప్రస్తుతం సందీప్ కిషన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దాదాపుగా సందీప్ కిషన్ హిట్ కొట్టక కొన్ని సంవత్సరాల పైనే అవుతోంది. మరి ఈ సినిమాతో నైనా హిట్ కొట్టి ఆర్థికంగా ఇబ్బందులను తొలగించుకుంటారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు