Rakul preet Singh: రకుల్ వెడ్డింగ్ కార్డ్ ధర తెలిస్తే షాక్..!

Rakul preet Singh

ఈమధ్య సినీ ఇండస్ట్రీలో సినీ సెలబ్రిటీల వివాహాలు పెద్ద ఎత్తున భారీ ఖర్చుతో జరుగుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే చాలామంది కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక యంగ్ హీరోయిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కడ పోతుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీతి సింగ్ ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీనితో ఏడు అడుగులు వేయబోతోంది..గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉంటున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. మొదట తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి సక్సెస్లను అందుకుంది.

అలా బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఈ మధ్యకాలంలో తెలుగులో కూడా నటించలేదు. దీంతో అభిమానులు సైతం తెగ ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే నటిగా కొనసాగుతోంది.ఇక ఇప్పుడు బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానినీ తో ఈనెల 21వ తేదీన గోవాలో చాలా గ్రాండ్ గా వీరి వివాహం జరగబోతోంది. అందుకు సంబంధించి ఒక వెడ్డింగ్ కార్డు కూడా సోషల్ మీడియాలో వైరంగా మారుతోంది. నరేంద్ర మోడీ మాల్దీవుల పైన విధించినటువంటి ఆంక్షల కారణంగా వీరి వివాహం గోవాలో జరగబోతున్నట్టు సమాచారం.

ఇప్పటికే రకుల్,జాకీ భగ్నాని పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి కాబోతున్నాయి. మూడు రోజుల పాటు గోవాలో వీరి వివాహం చాలా అందంగా, గ్రాండ్ గా జరగబోతుంది.. తాజాగా రకుల్ వెడ్డింగ్ కార్డు కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.. అదేమిటంటే.. ఈ వెడ్డింగ్ కార్డుపై గోవా అందాలను అద్భుతంగా డిజైన్ చేసి.. గోవా మొత్తాన్ని చూపించినట్టుగా కనిపిస్తోంది. ఈ పెళ్లి కార్డులో రకుల్ ,జాకీ భగ్నాని పేర్లతోపాటు అబ్ దోనో భగ్నాని అని రాశారు.

- Advertisement -

ఈ స్పెషల్ వెడ్డింగ్ కార్డ్ ధర ఒక్కొక్కటి సుమారు 20వేల రూపాయల వరకు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.. మూడు రోజులపాటు జరిగే ఈ పెళ్లి వేడుకలలో చాలా ప్రత్యేకంగా ఏర్పాట్లతో పాటు భోజనాలను కూడా చేయించబోతున్నారట. అలాగే వీరి పెళ్లి వేడుకకు కూడా సరికొత్త గా డిజైన్ చేయించబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రకుల్ పెళ్లి కార్డు ధర చూసి పలువురు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు