Rakul Preet Singh Marriage : రకుల్ పెళ్లి గోవాలోనే… దీనికి వెనుక పెద్ద కథే ఉంది

Rakul Preet Singh Marriage

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తెలుగులో ఈమెకు చాలా హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక్కడ కాస్త ఫేం వచ్చిన తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ కూడా ఈ బ్యూటీ అవకాశాలు వచ్చాయి. కానీ పెద్దగా సక్సెస్ మాత్రం అందలేదు. ఈమెకు బాలీవుడ్ సక్సెస్ అయితే ఇవ్వలేదు కానీ, ఓ జోడీని అయితే ఇచ్చింది. బాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాత అయిన జాకీ భగ్నానీతో రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే.

ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితమే వీళ్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు పెళ్లి పీటలెక్కడానికి కూడా రెడీ అయ్యారు. ముందుగా రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ తమ పెళ్లి మాల్దీవుల్లో చేసుకోవాలని అనుకున్నారు. కానీ, అదే టైంకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి – మాల్దీవులకు సంబంధించిన విషయం వైరల్ అయింది. దీంతో రకుల్ తమ పెళ్లిని మాల్దీవుల్లో కాకుండా స్వదేశంలో చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.

ఈ క్రమంలో వీరి పెళ్లి వేదిక గోవా ఫైనల్ అయింది. గోవాలో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ ఒకటి కానున్నారు. ఈ నెలలోనే వీరి పెళ్లి జరగనుంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ పెళ్లి గోవాలోనే జరగడానికి ఒక ప్రత్యేక కారణం ఉందని తెలుస్తుంది. రకుల్ – జాకీల ప్రేమ గోవాలోనే పుట్టిందట. అంతే కాదు… ఖాళీ సమయం దొరికినప్పుడల్లా… ఈ లవ్ బర్డ్స్ గోవాలోనే ఏంజాయ్ చేస్తారట. ఈ సెంట్ మెంట్ ను ఫాలో అవుతూ పెళ్లిని కూడా గోవాలోనే చేసుకోవాలని అనుకున్నట్టు సమాచారం.

- Advertisement -

అయితే ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు పెళ్లి చేసుకుని, హనీమూన్ లాంటివి చేసుకోకుండా.. తమ పనుల్లో బిజీ అయిపోతున్నారు. ఇప్పుడు రకుల్ – జాకీ కూడా పెళ్లి తర్వాత హనీమూన్ కి వెళ్లడం లేదట. పెళ్లి అయిన తర్వాత రకుల్ చేయాల్సిన సినిమా షూటింగ్స్ లో పాల్గొంటుందని టాక్. అలాగే జాకీ భగ్నానీ కూడా తాను నిర్మించాల్సిన సినిమా పనుల్లో ఉంటాడని తెలుస్తుంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు