Bigg Boss Amardeep: అమర్ దీప్ తండ్రి కాబోతున్నాడా… స్టేజ్‌పైనే లీక్ చేసిన శ్రీముఖి

Bigg Boss Amardeep

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్. కానీ, పల్లవి ప్రశాంత్ తో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న కంటెస్టెంట్ అమర్ దీప్. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్ లోకి వచ్చిన అమర్ దీప్… స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు. అంతే కాదు… పల్లవి ప్రశాంత్ కు గట్టి పోటీ ఇచ్చి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి రన్నర్ గా నిలిచాడు. బయటికి వచ్చిన తర్వాత కూడా అమర్ దీప్ క్రేజ్ ఏం తగ్గలేదు.

రీసెంట్‌గా సినిమా కూడా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. దీనిలో ఇన్‌స్టాగ్రామ్ స్టార్ సుప్రీత హీరోయిన్ గా చేస్తుంది. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి అందరికీ తెలిసిందే. ఈమె హీరోయిన్ కావడంతో సినిమాపై మంచి హైప్ ఉంది. అలాగే ఈ ఇద్దరికి ఇది మొదటి సినిమా. ఇదిలా ఉండగా, అమర్ దీప్ తండ్రి కాబోతున్నాడు అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు ఏం జరిగింది అంటే… వాలంటైన్స్ డే సందర్భంగా ఓ షో నిర్వహిస్తున్నారు. ఈ షోకి శ్రీముఖి యాంకర్. ఈ షోకి అమర్ దీప్ తన భార్య తేజస్వినితో పాటు ముక్కు అవినాష్, సిద్ధు, కార్తిక దీపం ఫేం నిరుపమ్ తమ భార్యలతో వచ్చారు. ఈ సందర్భంగా కొన్ని గేమ్స్ పెట్టింది శ్రీముఖి. అందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. అయితే ఈ ప్రోమోలో… అమర్ దీప్ తండ్రి కాబోతున్నాడు.. తేజస్విని గర్భవతి అంటూ స్టేజ్ పైనే రివీల్ చేసింది శ్రీముఖి.

- Advertisement -

తాను తండ్రి కాబోతున్నట్టు గానీ, తేజస్విని గర్భవతి అని కానీ, ఇప్పటి వరకు ఈ జంట ఎక్కడా ప్రకటించలేదు. ఈ స్టేజ్ పైన శ్రీ ముఖి చెప్పడంతో ఇందులో ఎంత వరకు నిజం ఉంది అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇది నిజమని తెలియాలంటే… ఈ ఎపిసోడ్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా, ఈ ఎపిసోడ్ వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న టెలికాస్ట్ కానుంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు