Srimukhi: రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమలో పడిన శ్రీముఖి.. నిజమే..!

బుల్లితెర రాములమ్మగా , స్టార్ యాంకర్ గా గుర్తింపు దక్కించుకున్న శ్రీముఖి గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు.. ఒకవైపు యాంకర్ గా అదరగొడుతూనే మరొకవైపు నటిగా కూడా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. పటాస్ షో ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తన వాక్చాతుర్యంతో అందచందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా పలు ప్రోగ్రామ్స్ లలో హోస్ట్ గా చేసే అవకాశాన్ని దక్కించుకుంది. అంతేకాదు సినిమా ఈవెంట్లకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్న శ్రీముఖి.. దుబాయ్ లో జరిగే సైమా అవార్డ్స్ లో కూడా హోస్ట్ గా చేసి అందరినీ ఆకట్టుకుంది.

ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. రోజుకొక లేటెస్ట్ ఫోటోషూట్ తో యువతను అలరిస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఈమెకు ఇంస్టాగ్రామ్ లో కూడా ఫాలోవర్స్ భారీగా ఉన్నారు. ఇదిలా ఉండగా వయసు ముదిరిపోతున్నా ఇంకా వివాహం చేసుకోలేదు ఈ ముద్దుగుమ్మ.. కానీ ఈమె గురించి పెళ్లి వార్తలు మాత్రం ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా శ్రీముఖి ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. ఇక ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మా లో సూపర్ సింగర్ అనే ఒక రియాల్టీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా ఒకటి రిలీజ్ కాగా తన ప్రేమ విషయాన్ని ఆమె బయటపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

ఈ వీక్ ఎపిసోడ్ లో సింగర్స్ అంతా రెట్రో నేపథ్యంలో సాంగ్స్ పాడుతున్నారు. ఈ ప్రోమోలో జడ్జ్ , లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ శ్రీముఖితో డాన్స్ చేస్తూ..సైగ చేస్తాడు. దీంతో తను స్పందించి… ఈ తుంటరి అబ్బాయి ఇలా చేస్తాడని అప్పుడే అనుకున్నాను.. కానీ నేను మీతో లవ్ లో లేను.. రాహుల్ సిప్లిగంజ్తో ప్రేమలో ఉన్నానని వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక శ్రీముఖి ఎప్పటినుంచో ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు రాగా.. త్వరలో ఈ బ్యూటీ గుడ్ న్యూస్ చెప్పబోతుందని ఫ్యాన్స్ హ్యాపీగా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా రాహుల్ సిప్లిగంజ్ తో తాను సరదాకే ప్రేమలో ఉన్నానని చెప్పినా కొంతమంది మాత్రం ఏమో నిజమవ్వచ్చేమో అంటూ అనుమానాలకు తావు ఇస్తున్నారు.. మరి దీనిపై పూర్తి విషయాలు తెలియాలి అంటే శ్రీముఖి స్పందించక తప్పదు.

- Advertisement -

 

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు