Mahesh Babu: మహేష్ బాబు కోసం రాజమౌళి భారీ ప్లాన్.. ఏడాదికి రెండు నెలలు !

మహేష్ బాబు ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. 40 పదుల వయసు దాటినప్పటికీ చెక్కుచెదరని అందంతో ఇప్పటికీ చిన్న పిల్లాడిలా కనిపిస్తూ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉంటున్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక మహేష్ బాబు ప్రతి ఒక్క సినిమా షూటింగ్ అయిపోయిన అనంతరం తాను వెకేషన్ కి వెళుతూ…. ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఇక మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని రాజమౌళితో చేయబోతున్నాడనే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. “SSMB29” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. రాజమౌళితో సినిమా అనగానే ప్రతి ఒక్క హీరో ఏదో ఒక జైలుకి వెళుతున్నారు అనేంతలా ఫీల్ అవుతూ ఉంటారు.

ఎందుకంటే సినిమా ఎన్ని సంవత్సరాలకి ముగుస్తుందో ఎవరికీ తెలియదు. పాన్ ఇండియన్ స్టార్ హీరో అవుతాడని ఓ పక్క ఆనందం ఉన్నా కూడా దాదాపు మూడేళ్లపాటు ఒకే సినిమాలో పనిచేయాల్సి వస్తుందని కొంత బాధతో ఉంటారు. రాజమౌళితో సినిమా అంటే బయటకి ఎక్కడికి వెళ్లకుండా కంటిన్యూగా షూటింగ్ చేయాల్సి వస్తుంది. మహేష్ బాబు సంవత్సరంలో తప్పకుండా వెకేషన్ కి వెళ్తారు. మరి రాజమౌళితో సినిమా అంటే కనీసం మూడేళ్ల పాటు ఎక్కడికి వెళ్లకుండా షూటింగ్ చేయాల్సి వస్తుంది. మరి ఈ షెడ్యూల్ ని మహేష్ బాబు ఎలా కొనసాగిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు ఓ మాస్టర్ ప్లాన్ వేశారని తెలుస్తోంది. 9 నెలల పాటు షూటింగ్, 2 నెలలు వెకేషన్, నెల రోజులు యాడ్స్ చేస్తారని తెలుస్తోంది.

- Advertisement -

ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్లానింగ్ మాత్రం అద్భుతంగా ఉందని అంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. రాజమౌళితో సినిమా మొదలుపెట్టిన అనంతరం హీరోలకి సినిమా తప్ప మరో ధ్యాస అంటూ ఉండదు. హీరోలకి మరో ఆలోచన వచ్చే ఛాన్స్ కూడా ఇవ్వరు రాజమౌళి. మరి మహేష్ బాబు వేసిన ప్లాన్ ప్రకారం రాజమౌళి అలాంటి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. 2024 సంవత్సరంలో “SSMB29” సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా 2026 లేదా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.

 

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు