Captain Miller: సంక్రాంతి చల్లబడింది, రిపబ్లిక్ డే సందడి మొదలుకానుంది

ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సీజన్ పూర్తయిపోయింది. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గుంటూరు కారం సినిమా మిశ్రమ స్పందన అందుకొని నడుస్తుంది. ఈ సినిమాలులో మహేష్ బాబు కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. కేవలం మహేష్ మాత్రమే ఈ సినిమాని నిలబెట్టాడు అంటూ ప్రశంసలు కూడా వచ్చాయి. ఇకపోతే మహేష్ ఈ సినిమాలో నటించడం తీరు అద్భుతం చెప్పొచ్చు. త్రివిక్రమ్ రేంజ్ డైలాగ్స్ లేకపోయినా కొంతమేరకు పరవాలేదు అనిపించుకుంది. గుంటూరు కారం సినిమా.

ఇకపోతే ఈ సినిమాతో పాటు హనుమాన్, సైంధవ్, నా సామిరంగా సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే అన్నిటిని మించి హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబడుతూ హౌస్ఫుల్ బోర్డులతో కొనసాగుతుంది.ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇకపోతే ఈ మంత్ 26న రిపబ్లిక్ డే అనే సంగతి తెలిసిందే. అయితే రిపబ్లిక్ డే కూడా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. వీటిలో ఎక్కువ శాతం తమిళ సినిమాలు ఉన్నాయి.

ప్రస్తుతం తెలుగు సినిమాలు గురించి పక్కన పెడితే ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ జనవరి 25న రిలీజ్ కానుంది. దీనిలో ధనుష్ తో పాటు తెలుగు హీరో సందీప్ కిషన్ కూడా నటించాడు. అలానే శివకేర్తికేయన్ నటించిన ఆయాలన్ సినిమా కూడా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితోపాటు ఫైటర్, 105 మినిట్స్ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల హవా ఇప్పటికే చల్లబడిపోయింది.

- Advertisement -

ప్రస్తుతం హనుమాన్ మాత్రమే ఊహించనని విధంగా ముందుకు సాగుతుంది. ముందు ముందు హనుమాన్ కి థియేటర్లు కూడా పెరిగే అవకాశం ఉంది. రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అవుతున్న సినిమాలు ఏ మాత్రం తేడా కొట్టిన కూడా హనుమాన్ సినిమా లాంగ్ రన్ లో కొనసాగుతుందని చెప్పొచ్చు. మొత్తానికి ప్రశాంత్ వర్మ సైకిల్ స్టేట్మెంట్ నిజమే అనిపించుకుంది సోషల్ మీడియాలో ఆ వీడియో షేర్ అవుతుంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు