NTR Death Anniversary: బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వెనుక ఇంత కథ ఉందా..?

తెలుగు నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు.. ఎన్టీఆర్ అప్పటి జనరేషన్ కే కాకుండా ఇప్పటి జనరేషన్ కి కూడా ఒక రోల్ మోడల్ అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో కూడా తన హవా కొనసాగించారు. అలా ఎన్నో అరుదైన ఘనతలు కూడా అందుకున్నారు నందమూరి తారక రామారావు.. ఇకపోతే ఈరోజు ఎన్టీఆర్ డెత్ యానివర్సరీ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం.

1942 మే 2వ తేదీన నందమూరి తారక రామారావు వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు బసవతారకం.. ఎన్టీఆర్ కు స్వయాన మేనమామ కుమార్తె ఈమె.. ఎన్టీఆర్ భార్య బసవతారకం 1985లో మరణించడంతో ఆమె జ్ఞాపకార్థంగా ఒక క్యాన్సర్ హాస్పిటల్ ను కూడా నిర్మించి అందులో ఉచితంగానే వైద్య సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ హాస్పిటల్ బాధ్యతలను ఎన్టీఆర్ వారసులు నందమూరి బాలకృష్ణ తన చేతుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఉచితంగా వైద్యం కూడా పొందారు.

ఎన్టీఆర్ – బసవతారకం దంపతులకు మొత్తం 12 మంది సంతానం కాగా.. ఇందులో 8 మంది కుమారులు , నలుగురు కూతుర్లు.. సీనియర్ ఎన్టీఆర్ షూటింగ్లో బిజీగా ఉండడం వల్లే.. ఈమె దగ్గరుండి పిల్లలను చూసుకున్నారు. ముఖ్యంగా బాలయ్య , హరికృష్ణ వంటి వారు హీరోలుగా మారడానికి బసవతారకం ప్రధాన పాత్ర పోషించారని చెప్పవచ్చు. సీనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు బయటికి వెళ్లినా సరే తన భార్య ఎదురు వచ్చేవారట. ఎన్టీఆర్ భార్య బసవతారకం గురించి ఎంతోమంది దర్శక నిర్మాతలు కూడా ఎన్నో సందర్భాలలో మాట్లాడడం జరిగింది.

- Advertisement -

ముఖ్యంగా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా బాగా పలకరిస్తూ భోజనం వడ్డించిన తర్వాతనే పంపించేవారట కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఎక్కువగా ఆరాటపడుతూ ఉండేవారట. అందుకే సినిమా సెట్టింగ్ కి కూడా చాలా అరుదుగా వచ్చే వారట. ఎన్టీఆర్ షూటింగ్ సమయంలో ఎక్కువగా బయట ఆహారాలను తినేవారు కాదట. కేవలం ఆయన కోసమే బసవతారకం స్వయంగా ఇంటి నుంచి క్యారేజ్ కూడా పంపించేవారట. ఎన్టీఆర్ ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకునేవారని తెలుస్తోంది. అయితే ఈమె తన ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల చివరికి గైనిక్ క్యాన్సర్ కి గురయ్యారు.. అలా ఈమె చనిపోవడంతో ఈమె జ్ఞాపకార్థం ఎన్టీఆర్ బసవతారకం హాస్పిటల్ ని స్థాపించారు.

 

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు