Prabhash: ప్రభాస్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ కి పెద్ద పండగే..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు వివాహం చేసుకుంటున్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా ప్రభాస్ అభిమానులు ఆయన పెళ్లి చేసుకుంటే చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈయన పెళ్లి వార్తలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.. కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి కూడా ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి ఉంటుందనే విషయాన్ని తెలియజేసింది. ఇప్పుడు తాజాగా ఈయన పెళ్లి పై మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతోంది. ఆ విషయాన్ని చూద్దాం

 

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి ఈ ఏడాది ఉంటుందని తెలిపింది. అయితే ప్రభాస్ పెళ్లి ఎవరితో ఎప్పుడు అనే విషయం మాత్రం తెలియజేయలేదు. అప్పటినుంచి ప్రభాస్ పెళ్లి గురించి ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ప్రభాస్ తన బంధువుల అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఈ విషయం పై ఇప్పటికీ క్లారిటీ రాలేదు.. ప్రస్తుతం ప్రభాస్ వయసు 40 పై మాటే.. గతంలో హీరోయిన్ అనుష్క ను వివాహం చేసుకుంటారనే రూమర్స్ వినిపించాయి. కానీ వీరిద్దరూ మేము మంచి స్నేహితులం అంటూ క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -

ఇప్పుడు తాజాగా మళ్లీ ప్రభాస్ పెళ్లి గురించి ప్రభాస్ కుటుంబ సభ్యుల నుంచి ఒక న్యూస్ లీక్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ కి త్వరలోనే పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారని.. నిశ్చితార్థం పెళ్లి డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. మార్చి 17వ తేదీన ప్రభాస్ ఎంగేజ్మెంట్ జరగబోతుందని.. ఏప్రిల్ 21న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ప్రభాస్ ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అనే విషయం గురించి మాత్రం తెలియజేయలేదు..కానీ ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా చాలా ఆనంద పడుతున్నారు.. మరి ఈ విషయాన్నినైనా ప్రభాస్ నిజం చేస్తారా లేదా అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. గత ఏడాది డిసెంబర్లో సలార్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.. ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ప్రభాస్.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు