Shekhar Kammula: మొత్తానికి పట్టాలెక్కినట్లే

 

ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న క్లాస్ డైరెక్టర్స్ లో శేఖర్ కమ్ముల ఒకరు. డాలర్ డ్రీమ్స్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాతో మంచి బ్రేక్ అందుకున్నాడు. శేఖర్ కమ్ముల అనగానే అందరికీ టక్కును గుర్తు వచ్చే సినిమా హ్యాపీడేస్. ఒక కాలేజ్ లైఫ్ ని కాలేజీలో ఉండే ఎంజాయ్మెంట్ ని ఫ్రెండ్షిప్ ఎమోషన్స్ ని అద్భుతంగా చూపించి మంచి హిట్ అందుకున్నాడు శేఖర్ కమ్ముల.

శేఖర్ కమ్ముల ఎన్ని సినిమాలు చేసినా కూడా దానిలో హ్యాపీడేస్ సినిమాకి ఉండే స్థాయి, వేరు దాని స్థానం వేరు. అయితే రీసెంట్గా నాగచైతన్యతో లవ్ స్టోరీ సినిమాను తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబట్టింది ఇకపోతే ఆ సినిమా తర్వాత ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల సినిమా చేస్తున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు. కానీ ఆ ప్రాజెక్టు గురించి అనౌన్స్మెంట్ తర్వాత సరైన అప్డేట్ లేకుండా నడిచింది. ఇకపోతే ఆ సినిమా షూటింగ్ నేడు యాదగిరిగుట్టలో స్టార్ట్ అయింది.

- Advertisement -

నాలుగు రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్లో నాగార్జున పాల్గొనున్నట్లు తెలుస్తుంది. ఇదివరకే తెలుగులో సార్ సినిమాతో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చాడు ధనుష్. ఇప్పుడు శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ సినిమాతో మరోసారి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ధనుష్ రీసెంట్గా నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందనతో నడుస్తుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా జనవరి 25న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమాలు సంక్రాంతి సీజన్ లో ఎక్కువగా ఉండటం వలన ఈ సినిమా పండక్కు రావాల్సింది కాస్త రిపబ్లిక్ డే కి రిలీజ్ అవుతుంది.

శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించినున్నట్లు తెలుస్తుంది. లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ధనుష్ కి కూడా తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. త్రీ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమైన ధనుష్ ఆ తర్వాత చేసిన ప్రతి సినిమా కూడా తెలుగులో డబ్బింగ్ గా రిలీజై మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ధనుష్ ఈ సినిమాతో పాటు తన సొంత దర్శకత్వంలో మరో సినిమాను చేయనున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు. శేఖర్ కమల ప్రాజెక్టు తర్వాత ఆ సినిమా ఉండే అవకాశం ఉంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు