Rakul preeth singh: రకుల్ పెళ్లి డేట్ ఫిక్స్…. భర్త ఏం చేస్తాడో తెలుసా….?

Rakul preeth singh: అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరటం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి… వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంది ఈ భామ. ఆ సినిమా అనంతరం వరుస సినిమాలో చేసుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగింది. తనదైన నటన, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

తెలుగులో వరుస సినిమాలు చేసుకుంటూ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే ఈ భామ బాలీవుడ్ ఇండస్ట్రీవైపుకు వెళ్ళింది. అక్కడ వరుస సినిమాలు చేసుకుంటూ బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. ప్రస్తుతం రకుల్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాను త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ హీరో, ప్రొడ్యూసర్ అయినటువంటి జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నానని, డేటింగ్ కూడా చేస్తున్నానంటూ గత రెండేళ్ల క్రితమే రకుల్ ప్రీత్ సింగ్ అధికారికంగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.

తన ప్రేమ విషయం ప్రకటించిన వెంటనే వివాహం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ రకుల్ కొన్ని రోజుల తర్వాత వివాహం చేసుకుంటామని తేల్చి చెప్పింది. ఇక తాజాగా ఈ జంట ఒక్కటవబోతున్నారు. వచ్చే నెలలో అంటే ఫిబ్రవరి 22వ తేదీన వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినీ సెలబ్రిటీలందరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క సెలబ్రిటీలు డెస్టినేషన్ వెడ్డింగ్ ని ఇష్టపడుతున్నారు.

- Advertisement -

ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారట. గోవాలో కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరగబోతుందట. ఇక వివాహ అనంతరం ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారట. ఇక వీరి పెళ్లిపై రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం రకుల్ పలు సినిమా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు