Actress: డేటింగ్ ఓకే.. పెళ్లి మాత్రం వద్దు – ప్రభాస్ హీరోయిన్..!

Actress:  ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా జంటలు డేటింగ్ చేసుకొని పెళ్లి చేసుకుంటుంటే.. మరికొంత మంది డేటింగ్ అయితే చాలు పెళ్లి మాత్రం వద్దు అంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టి ఇప్పుడు బాలీవుడ్ లో అదరగొడుతోంది ప్రభాస్ హీరోయిన్ తాప్సీ.. తన యాక్టింగ్ స్కిల్స్ తో సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ 2010లో విడుదలైన టాలీవుడ్ మూవీ ఝుమ్మంది నాదం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2013లో చశ్మీర్ చిత్రంతో హిందీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈమె పింక్ , నామ్ షబానా వంటి చిత్రాలలో నటించి తన నటనతో ప్రశంసలు కూడా అందుకుంది.

రీసెంట్ గా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో కలిసి డంకీ సినిమాలో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ..ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా తన నటనకు మాత్రం ప్రశంసలు లభించాయి.డంకీ సినిమా తర్వాత తాప్సీ మరే ప్రాజెక్టులో కూడా నటించడం లేదు. ప్రస్తుతం పర్సనల్ లైఫ్ కి తన సమయాన్ని కేటాయిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఒక యుట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అవుతూ అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే పదేళ్లుగా తాను రిలేషన్ షిప్ లో ఉన్నానని .. బ్యాట్మింటన్ ప్లేయర్ మథిహాస్ తో డేటింగ్ చేస్తున్నానని తెలిపింది. అయితే ఇందులో దాచాల్సిందేమీ లేదు అని తనతో రిలేషన్షిప్ లో ఉన్నందుకు తాను మరింత హ్యాపీగా ఉన్నానని వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ.

అయితే గత పది సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నాము ఇప్పటివరకు పెళ్లి గురించి అయితే ఆలోచించలేదు అంటూ తెలిపింది. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి గురించి నేటిజెన్లు ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం కూడా తెలిపింది. మథియాస్ తో గత పది ఏళ్లుగా డేటింగ్ చేస్తున్నాను.. ఇది చాలా సంతోషకరమైన విషయము.. నేను నా సినిమా కెరియర్ ప్రారంభించిన మూడు సంవత్సరాల తర్వాత అతనిని కలిసాను.. అప్పటినుంచి ఇద్దరం కలిసి ఉన్నాము..అతడిని విడిచి పెట్టే ఆలోచనలో లేను.. మరెవరితో కూడా డేటింగ్ చేయాలనుకోవడం లేదు అంటూ స్పష్టం చేసింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

ఇదిలా ఉండగా ఇటీవల వీరిద్దరు వివాహం చేసుకుంటారని బాలీవుడ్లో ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిపై స్పందించిన తాప్సి ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేదు.. కానీ పిల్లల్ని కనాలనుకున్నప్పుడే వివాహ బంధంలోకి అడుగు పెడతాము అంటూ తెలిపింది. గతంలో ప్రభాస్ తో డార్లింగ్ సినిమాలో నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తానికి అయితే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు