Shah Rukh Khan: జవాన్ ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా థియేటర్స్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే కాదు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చరిత్రలో సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది.

గత కొన్నేళ్లుగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్ లేక ఢీలా పడిపోయిన షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ప్రథమార్థం లో పఠాన్ తో సాలిడ్ కంబ్యాక్ ను ఇచ్చాడు. దాదాపు వెయ్యి కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిన పఠాన్ సినిమా జోష్ తగ్గక ముందే సెప్టెంబర్ 7న జవాన్ తో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ ను హిట్ ను కొట్టాడు షారుఖ్ ఖాన్. ఇక ఈ రెండు సినిమాల హిట్ తో షారుఖ్ ఖాన్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.

అయితే మరి ఇంతటి విజయాన్ని షారుఖ్ ఖాన్ కు అందించిన జవాన్ సినిమా త్వరలోనే ఓటిటిలోకి రాబోతుంది. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. వచ్చే నవంబర్ 2 నుంచి జవాన్ అఫీషియల్ గా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవబోతున్నట్టు సమాచారం అందుతోంది. షారుఖ్ ఖాన్ కు జోడిగా ఈ సినిమాలో లేడి సూపర్ స్టార్ నయనతార, దీపికా పదుకునే నటించారు. విజయ్ సేతుపతి విలన్ కనిపించారు. అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతగా ప్రదర్షింపబడుతుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు