Month Of Madhu: సినిమాలో విషయం ఉంటె రివ్యూయర్స్ ఆపగలరా..?

కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర లీడ్ రోల్స్ లో శ్రీకాంత్ నగోతి డైరెక్షన్లో రూపొందిన మంత్ ఆఫ్ మధు సినిమా ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా మంచి అప్లాజ్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా నిరాశ ఎదురైంది. మిక్స్డ్ రివ్యూస్ రావటమే ఇందుకు కారణం అని చెప్పాలి.
సినిమా యూనిట్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొన్న డైరెక్టర్ శ్రీకాంత్, హీరోయిన్ స్వాతి రివ్యూయర్స్ ఈ సినిమాను చంపేస్తున్నారంటూ మండి పడ్డారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ కామెంట్స్ మీద సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాలో కంటెంట్ ఉంటే, ప్రమోషన్స్ తో పని లేకుండా మౌత్ టాక్ తోనే చిన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు.
నిజానికి మంత్ ఆఫ్ మధు సినిమా బాగున్నప్పటికీ అదే రోజున అరడజను చిన్న సినిమాలు రిలీజ్ అవ్వటం ఈ సినిమాకి మైనస్ అయ్యింది. సినిమాలో మంచి ఎమోషన్ ఉన్నప్పటికీ ప్రమోషన్స్ ఎఫిషియెంట్ గా లేకపోవటం వల్ల ఆడియెన్స్ రీచ్ కాలేకపోయింది. మొత్తానికి కంటెంట్ కి ప్రశంసలు వచ్చినప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ అందకపోవటంతో డైరెక్టర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తోంది.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు