Chiranjeevi: మెగా స్టార్ సినిమా ముహూర్తం ఎప్పుడంటే ?

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల ప్రొడక్షన్ లో రాబోతుంది. ఆ సినిమాకు సోగ్గాడే చిన్ని నాయన ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు గతేడాది బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వశిష్ఠ దర్శకత్వంలోను ఒక సినిమా చేయబోతున్నాడు.

అయితే కళ్యాణ్ కృష్ణ తో మెగా స్టార్ చిరంజీవి చేయబోయే చిత్రం ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉండటంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి మరికొద్ది రోజుల సమయం పట్టనున్నట్టు తెలుస్తుంది. అయితే వశిష్ఠ సినిమా పనులు మాత్రం చక చక జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుకుంటున్న ఈ సినిమాకు నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం అందుతోంది.

సోషియో ఫాంటసీ నేపథ్యం లో రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి వచ్చే ఏడాది ఏప్రిల్ కల్ల షూటింగ్ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఏప్రిల్ నుంచి CG పనులు 6 నెలల పాటు జరగనున్నాయట. పక్క ప్లానింగ్ తో ప్రొసీడ్ అవుతున్న మూవీ టీం  ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సంక్రాంతి కిరిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు