Bigg Boss Season7: హౌస్ లో బాటమ్ త్రి ఎవరు? – ఇంట్రస్టింగ్ ప్రోమో..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకీ ఇంట్రస్టింగ్ గా మారుతోంది. గత సీజన్స్ కంటే ఈ సీజన్ గేమ్ లో ఎక్కువ చేంజెస్ చేయటంతో ఫస్ట్ డే నుండే షో ఇంట్రస్టింగ్ గా తయారయ్యింది. ఈ సీజన్లో కంటెస్టెంట్స్ హౌస్ మేట్స్ అయ్యే అర్హత సాధించాలంటే పవర్ అస్త్ర టాస్క్ లో విన్ అవ్వాలనే రూల్ పెట్టడంతో ఈ సరి ఫిజికల్ టాస్క్ లు కూడా ఆసక్తిగా ఉంటున్నాయి.
ఇదిలా ఉండగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున కూడా గత సీజన్స్ కంటే ఈ సీజన్లో బెటర్ గా హోస్ట్ చేస్తున్నాడు. వీకెండ్ ఎపిసోడ్స్ లో బాగా ఆడుతున్న కంటెస్టెంట్స్ ని మెచ్చుకుంటూ వోర్స్ట్ పర్ఫామర్స్ కి, తప్పులు చేసిన కంటెస్టెంట్స్ కి గట్టిగా క్లాస్ పీకుతున్నాడు. ప్రతివారం లాగానే ఈ వీకెండ్ ఎపిసోడ్ కూడా ఆసక్తిగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.
తాజాగా రిలీజైన వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో కూడా ఆసక్తిగా ఉంది. ఈ వీకెండ్ ఎపిసోడ్లో బాటమ్ త్రి కంటెస్టెంట్స్ ఎవరో డిసైడ్ చేయాలనీ నాగార్జున కోరగా హౌస్ మేట్స్ అందరు ఎవరి ఒపీనియన్ వారు చెప్పారు. అయితే, బాటమ్ త్రి ఎవరన్నది సండే ఎపిసోడ్ లో డిక్లేర్ చేస్తానని నాగార్జున ప్రోమో ఎండింగ్ లో ట్విస్ట్  ఇచ్చాడు.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు