Bigg Boss Season7: డేంజర్ జోన్ లో తేజ – ఈ వీక్ సేవ్ అవ్వడం కష్టమేనా..?

బిగ్ బాస్ సీజన్7 లో మిస్టర్ ఎంటర్టైనర్ గా ఉన్న టేస్టీ తేజ ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్నాడు. నామినేషన్స్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ కంటే తేజ లీస్ట్ ఓట్స్ తో డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గత వారంలో పవర్ అస్త్ర టాస్క్ సమయంలో తేజ గౌతమ్ పట్ల వ్యవహరించిన తీరుకి హౌస్ మేట్స్ తో సహా ఆడియెన్స్ లో కూడా నెగిటివ్ ఇంప్రెషన్ కలిగింది.

కానీ, ఆ వారం హౌస్ నుండి రతిక ఎలిమినేట్ అవ్వటం వల్ల తేజ సేవ్ అయ్యాడు. ఫిజికల్ టాస్క్ లో తేజ ప్రవర్తనకి పనిష్మెంట్ గా జైల్ కి పంపాడు నాగార్జున. అయితే, ఒకరోజు తర్వాత రిలోఇజ్ అయ్యాడు తేజ.

జైలు నుండి రిలీజ్ అయ్యాక ఏ మాత్రం మార్పు లేకుండా మునుపటిలాగే ఎంటర్టైనింగ్ గా ఉంటున్నాడు. గురువారం ఎపిసోడ్లో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో యావర్, తేజ మధ్య జరిగిన ఎమోషనల్ సీన్ ఎపిసోడ్ కే హైలైట్ గా నిలువగా ఇద్దరికీ పాజిటివిటి పెరిగింది. తేజ తర్వాత ఓట్స్ పరంగా శుభశ్రీ లీస్ట్ పొజిషన్లో ఉంది.

- Advertisement -

ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్స్ చూస్తే ఆడియెన్స్ ఓట్స్ కి అనుగుణంగానే జరిగాయి. మరి, ఈ వీక్ కూడా ఓట్స్ కి అనుగుణంగానే తేజ ఎలిమినేట్ అవుతాడా లేక సేవ్ అవుతాడా అన్నది ఆసక్తిగా మారింది. తేజ హౌస్ నుండి ఎలిమినేట్ అయితే అతన్ని రీప్లేస్ చేసే ఎంటర్టైనింగ్ కంటెస్టెంట్ వస్తాడా లేదా చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు