Priyamani: ప్రియమణికి టాలీవుడ్ నిర్మాత టార్చర్ ?

ప్రియమణి గురించి తెలుగు వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ తమిళ పొన్ను. ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ సినిమాల్లో బిజీగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే…. ప్రియమణి తాజాగా జవాన్ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

కేరళలో పుట్టిన ఈ అందాల కుట్టి 2003లో ఓ తెలుగు సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగిపోతున్న సమయంలోనే వ్యాపారవేత్త ముస్తఫా రాజ్ తో ప్రియమణి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ప్రియమని మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తూ ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోను దూసుకుపోతోంది.

అయితే ప్రియమణి తన కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్ కు గురైనట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ నిర్మాత ప్రియమణిని వేధించాడట. తనతో గెస్ట్ హౌస్ కు వస్తేనే ఛాన్సులు ఇస్తానని ఆ నిర్మాత పేర్కొన్నాడట. అయితే దీనికి ప్రియమణి ఒప్పుకోకుండా… అతన్ని తెగ తిట్టేసిందట. ఇప్పుడు ఈ విషయం వైరల్గా మారింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు