Sai Pallavi: సాయి పల్లవిని రిజెక్ట్ చేసిన విజయ్ దేవరకొండ..!

లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. సాయి పల్లవి తొలి సినిమా అయిన ఫిదాలో ఆమె నటించిన నటనకి తెలుగు ఆడియన్స్ అందరూ ఫిదా అయిపోయారు. అప్పటినుండి ఆమె ఎన్నో సినిమాలు చేసుకుంటూ వచ్చింది. కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది ఈ బ్యూటీ. ముఖ్యంగా తనకు పాత్ర నచ్చి.. ఆ సినిమా ద్వారా తనకు, తన పాత్రకు మంచి గుర్తింపు లభిస్తుంది అంటేనే ఆ సినిమాలో అవకాశాలను అంగీకరిస్తుంది.

లేదంటే కోట్లు కుమ్మరించినా సరే ఆ పాత్ర చేయనని ముఖం మీదే చెప్పడంలో సాయి పల్లవి తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. అందుకే హీరోలకు ఎంత ఫాలోయింగ్ ఉందో సాయి పల్లవికి కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు ఈమె స్కిన్ షోలకి చాలా దూరం. పద్ధతిగా ఉండే పాత్రలతోనే ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అయితే అలాంటి సాయి పల్లవిని రిజెక్ట్ చేశారట విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం పరశురాం దర్శకత్వంలో రాబోతోంది.

ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ముందు హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకున్నారట దర్శకుడు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం తన బాడీ లాంగ్వేజ్ కి, సాయి పల్లవికి, ఈ స్టోరీకి అసలు సెట్ కాదని.. ఆమె వద్దంటే వద్దని చెప్పేశారట. దీంతో చేసేదేం లేక దర్శకుడు మృణాళ్ ని తీసుకున్నారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు