Sai Pallavi: సాయి పల్లవిని ఏడిపించిన టాలీవుడ్ స్టార్ హీరో..!

Sai Pallavi

తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్న హీరోయిన్ సాయి పల్లవి గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తన సహజమైన నటనతో, డాన్స్ తో నెంబర్ 1 స్థానాన్ని సంపాదించుకుంది. టీవీ రియాలిటీ డాన్స్ షో ఢీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ తమిళ ముద్దుగుమ్మ తొలిసారి లీడ్ రోల్ లో మలయాళ ప్రాజెక్ట్ ప్రేమమ్ లో మెరిసింది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో భానుమతిగా మెప్పించింది.

ఈ బ్యూటీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ గా ఇప్పటికే 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 8 ఏళ్లలో 14 సినిమాలు, వివిధ కేటగిరీలలో 25 అవార్డులను అందుకుంది. కంటెంట్ ఉన్న కథలను మాత్రమే ఎంచుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తోంది. అయితే సాయి పల్లవి ఓ సినిమా షూటింగ్ సమయంలో హీరో వల్ల ఇబ్బంది పడి ఏడుస్తూ బయటకి వెళ్ళిపోయిందట. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. నాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే వన్ ఆఫ్ ద హిట్ సినిమాగా నిలిచిన ఎంసీఏ సినిమాలో హీరోయిన్ గా నటించింది సాయి పల్లవి.

ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. 2017లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సాయి పల్లవికి – నానికి మధ్య ఇగోలు, పంతాలు నడిచాయట. ఎవరికి వారే తాము గొప్ప నాచురల్ స్టార్ అన్నట్టుగా బిహేవ్ చేయడం, చివరికి ఆ గొడవలు పెరిగి పెద్దవి కావడం జరిగాయట. ఇక చివరకు నాని బాగా ఇబ్బంది పెట్టడంతో హర్ట్ అయిన సాయి పల్లవి ఏడుస్తూ షూటింగ్ స్పాట్ నుంచి వెళ్ళిపోయి ఆ తర్వాత షూటింగ్ కి కూడా రాలేదట. ఆ తర్వాత దర్శకుడు వేణు, నిర్మాత దిల్ రాజు కలగజేసుకొని వీరిద్దరినీ కూర్చోబెట్టి ఇష్యూ ని సెటిల్ చేయించారట. చివరకు నానితో సాయి పల్లవికి సారీ చెప్పించారట. ఆ తర్వాత వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారట

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు