Sai pallavi
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గత కొద్దీ రోజులుగా సినిమాలు చేయట్లేదనే విషయం అందరికి తెలిసిందే. కెరీర్ బిగినింగ్ లో హిట్స్ సూపర్ హిట్స్ అందుకున్న సాయి పల్లవి ఇటీవల కాలంలో చేసిన సినిమాలన్ని ఫ్లాప్ అవుతూ వస్తుండటంతో ఆమె ఇకపై సినిమాలు చేయదని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ సాయి పల్లవి మళ్ళీ సినిమాలలో నటిస్తుంది అది కూడా మీడియాకి ఆమె సినిమాలో నటిస్తోన్న విషయం తెలియకుండా జాగ్రత్త పడుతోంది.
అయితే సాయి పల్లవి సైలెంట్ గా నటిస్తోన్న ఆ బాలీవుడ్ చిత్రం ఏంటా అని అనుకుంటున్నారా.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ను హీరోగా పరిచయం చేస్తూ బాలీవుడ్ లో రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందులో ఒక సినిమా ఇటీవలనే సూపర్ హిట్టైన లవ్ టుడే రీమేక్ కాగా మరో సినిమా యాక్షన్ జానర్ లో రాబోతుంది. అయితే లవ్ టుడే రీమేక్ లో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, మరో సినిమాలో సాయి పల్లవి నటిస్తుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ లో సాయి పల్లవి ని సినిమాలో సర్ప్రైజ్ గాఉంచాలనే ఉద్దేశ్యం తో ఆమె జునైద్ ఖాన్ సినిమాలో నటిస్తున్న విషయాన్నీ గోప్యంగా ఉంచి షూటింగ్ చేస్తోన్నరని పుకార్లు వినబడుతున్నాయి. ఇక ఈ విషయంలో నిజా నిజాలు పక్కన పెడితే.. సాయి పల్లవి అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ , టాలీవుడ్ లను వదిలేసి గ్లామర్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న బాలీవుడ్ సినిమాలో చేయడమేంటనీ, ఈ వార్తలు నిజం ఏమాత్రం లేదని సాయి పల్లవి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. మరీ నిజంగానే ఆ బాలీవుడ్ సినిమా చేస్తుందా లేదా అనేది అఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ వచ్చేవరకు చెప్పలేం.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the
Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.