Pawan Kalyan: ఉస్తాద్ ఉరుకులు పరుగులు నిజమేనా – లేక ఫ్యాన్స్ ని ఫూల్ చేస్తున్నారా..?

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు, మరో పక్క రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగా సినిమా షూటింగ్ బ్రేకులు పడుతూ నడుస్తోంది. ఉస్తాద్ తర్వాత షూటింగ్  స్టార్ట్ చేసిన ఓజి సినిమా షూటింగ్ మాత్రం జెట్ స్పీడ్ మీద సాగుతోంది.

ఇటీవలే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ అలాట్ చేసినప్పటికీ టీడీపీ అధినేత, ఏపీ ఎక్స్ సీఎం చంద్రబాబు అరెస్ట్ అవ్వటంతో మళ్ళీ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఎలక్షన్స్ దగ్గరపడుతున్న తరుణంలో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది.

ఏపీలో ఎలక్షన్స్ మార్చ్ లో జరిగే అవకాశం ఉంది కాబట్టి పవన్ మరో నెల రోజుల్లో పూర్తిగా పాలిటిక్స్ కే అంకితం అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటిదాకా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ 40శాతం వరకూ కంప్లీట్ అయ్యిందని టాక్ ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నెల రోజుల సమయం పూర్తిగా ఉస్తాద్ భగత్ సింగ్ కే అలాట్ చేసినా కూడా సినిమా పూర్తయ్యే అవకాశాలు కనిపించట్లేదు.

- Advertisement -

ఇదిలా ఉండగా సినిమా యూనిట్ మాత్రం షూటింగ్ చకచకా జరుగుతున్నట్లు కలర్ ఇస్తోంది. తరచూ పవన్ కళ్యాణ్ కి సంబందించిన ఎదో ఒక స్టిల్ ని రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ లో సినిమా మీద ఆశల్ని సజీవంగా ఉండేలా చూస్తోంది. కానీ రియాలిటీ చుస్తే వేరేలా ఉంది. ఉస్తాద్ షూటింగ్ లో ఉన్న పవన్, బాబు అరెస్ట్ వార్త వినగానే షూటింగ్ బ్రేక్ ఇచ్చి మంగళగిరిలో వాలిపోయాడు. మళ్ళీ రెండు రోజులు షూట్ చేసి రిమాండ్ లో ఉన్న బాబుకి సంగీభావం తెలిపేందుకు రాజమండ్రి బయల్దేరాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం ఉస్తాద్, ఓజి సినిమాలు ఎలక్షన్స్ తర్వాతనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు