Pawan Kalyan: దానికంటే ముందే ‘ఉస్తాద్’ రావాలని కోరుకుంటున్న ఫ్యాన్స్.. ఎందుకంటే?

Pawan Kalyan:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కన్ఫ్యూజన్ మళ్ళీ మొదలైంది. మొన్నటివరకు అందరికంటే ఎక్కువ సినిమాలు చేస్తూ, బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయాలపైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు. వీలు దొరికినప్పుడల్లా తాను చేస్తున్న సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక అందులో హరిహర వీరమల్లు షూట్ ఇప్పట్లో జరగదని తేలిపోయింది. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి ఈ రెండు సినిమాల పైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.

ఎందుకంటే భారీ సెట్టింగ్ లు లేకుండా తక్కువ రోజుల్లో షూటింగ్ ఫినిష్ అయ్యే సినిమాలు ఇవే. హరిహర వీరమల్లు సెట్టింగ్స్ లేకుండా తీయలేరు కాబట్టి దాన్ని ఆపేసారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా ఓజి గ్లిమ్ప్స్ రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజి కన్నా ముందే ఉస్తాద్ రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు.

దానికి కారణం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ రోజుల్లో షూటింగ్ ఫినిష్ అవ్వాలంటే ఓజి వల్ల కాదు. ఒకవేళ చిత్ర యూనిట్ తొందరగా ఫినిష్ చేద్దామని ట్రై చేసినా, ఎలక్షన్స్ టైం కి పూర్తి కాకపోతే రిజల్ట్స్ తర్వాతే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. పైగా ఓజి లాంటి డిఫరెంట్ సినిమాకు పవన్ పూర్తి సమయం కేటాయిస్తేనే సాలిడ్ కంటెంట్ పడుతుంది. అదీ గాక మొన్న వచ్చిన టీజర్ తో అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. అప్పుడు సినిమా ఏమాత్రం తేడా కొట్టినా ఫ్యాన్స్ ఆగ్రహానికి మేకర్స్ బలి కావాల్సి వస్తుంది.

- Advertisement -

అలా కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు టైం కేటాయిస్తే, అది నార్మల్ కమర్షియల్ సినిమా కాబట్టి నెలరోజుల్లో కూడా పూర్తి చేయొచ్చు. అందుకే ఎలక్షన్లు వచ్చే లోపు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కావాలని కోరుకుంటున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు