Prabhas’s Salaar: సలార్ చుట్టూ గందరగోళం – భాద్యులెవరు..?

Prabhas’s Salaar

సలార్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి ప్రభాస్ వరుస డిజాస్టర్స్ పరంపరకు బ్రేక్ వేస్తుందని అనుకున్న ఫ్యాన్స్ కి రోజుకో పీడకల మిగుల్చుతుంది. సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి పెద్దగా అప్డేట్స్ లేకపోవటం ఒక ఎత్తైతే, టీజర్లో ప్రభాస్ క్లియర్ గా కనిపించకపోవడం ఇంకో ఎత్తు.

సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుందని భావించిన ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా కానీ, ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవటంతో సినిమా పోస్ట్ పోన్ అయ్యిందన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సినిమా యూనిట్ నుండి కూడా ఎలాంటి స్పందన లేకపోవటంతో పోస్ట్ పోన్ అన్న విషయం ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయినట్టే అని తేలింది.

సినిమా రిలీజ్ చుట్టూ ఇంత గందరగోళం నెలకొన్నా కూడా సినిమా యూనిట్ సైలెంట్ గా ఉండటం పట్ల ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అంతే కాకుండా ఈ సినిమా విషయంలో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్యన డీల్ ఇంకా సెట్ కాలేదని టాక్ వినిపిస్తోంది. సలార్ సినిమా రైట్స్ కి నిర్మాతలు భారీ రేట్స్ చెప్తున్నారని, డిస్ట్రిబ్యూటర్స్ ఆ రేట్ పెట్టడానికి ముందుకు రావట్లేదని సమాచారం. ప్రభాస్ గత మూడు సినిమాలు డిజాస్టర్స్ ఉండటం, పైగా సలార్ గురించి మినిమమ్ హైలైట్స్ కూడా తెలియకపోవడం ఇందుకు కారణం అని తెలుస్తోంది.

- Advertisement -

టీజర్ కూడా క్లియర్ గా వదలకుండా RRR, కెజిఎఫ్ సినిమాల రేంజ్ లో రేట్స్ చెప్తే ఎలా కొనగలం అన్నది డిస్ట్రిబ్యూటర్స్ వాదనగా తెలుస్తోంది. మొత్తానికి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సలార్ విషయంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ మినిమమ్ కేర్ కూడా తీసుకోవట్లేదని స్పష్టం అవుతోంది. మరి, ఇప్పటికైనా ఈ సినిమా విషయంలో మేకర్స్ నోరు మెదుపుతారేమో వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు