Bigg Boss Telugu 7: బిగ్ బాస్ లో వీపీ అంటే ఆట సందీప్ ?

Bigg Boss Telugu 7

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ కొనసాగుతున్న ఆట సందీప్ నిన్న జరిగిన ఎపిసోడ్ వీపీ అని ప్రూవ్ అయ్యాడు. హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి సేఫ్ గేమ్ ఆడుతూ అందరి దృష్టిలో మంచిగా ఉంటున్న సందీప్ అదృష్టం కొద్దీ బిగ్ బాస్ పవర్ అస్త్ర ను గెలిచి, 5 వారాల ఇమ్మ్యూనిటీని పొందాడు. ఇక ఆ టాస్క్ గెలవడంతో సందీప్ మరింత వీక్ అయ్యాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

సోమవారం జరిగిన నామినేషన్ ప్రాసెస్ ముగిసాక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు పవర్ అస్త్ర పొందటానికి గాను ఒక టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా కంటెస్టెంట్స్ రణధీరా, మహాబలి అనే పేర్లతో రెండు టీం లుగా విడిపోయారు. ఆట సందీప్ సంచాలకుడిగా వ్యవహరించాడు. ఇక టాస్క్ ముగిసేసరికల్లా రణధీరా టీం విజేతగా నిలిచింది. దాంతో ఓడిపోయినా మహాబలి టీం లో సభ్యులంతా కలిసి రణధీరా టీం కు దక్కిన పవరస్త్ర కి సంబందించిన కీ దొంగతనం చేద్దామని చాలా ట్రై చేసిన హీరో శివాజీ తెలివి తేటల ముందు వాళ్ళ ప్రయత్నాలేవి ఫలించలేదు. దాంతో ఆట సందీప్ దగ్గర ఉన్న పవరస్త్ర ను మహాబలి టీం కు చెందిన శుభ శ్రీ దొంగతనం చేసింది.

శుభ శ్రీ దొంగతనం చేసిన తరువాత బిగ్ బాస్ ఆ దొంగతనం గురించి సందీప్ కు హింట్ ఇస్తూ ఒక చమక్కు విసిరాడు. కానీ సందీప్ అందులో ఉన్న గూడార్థాన్ని కనిపెట్టలేకపోయాడు. దీన్నిబట్టి చూస్తే సందీప్ గేమ్ పట్ల ఎంత కేర్ లెస్ గా ఉన్నాడనేది తెలుస్తోంది. నిజానికి ఆట సందీప్ మృదు స్వభావి కానే కాదు గతంలో సందీప్ పాల్గొన్న పలు షోలు చూసిన వాళ్లకు ఈ విషయం బాగానే తెలుసు కానీ సందీప్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన దగ్గరి నుండి మాత్రం కావాలనే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెప్పు పొందటానికి మరియుఎక్కువ రోజులు హౌస్ లో ఉండటానికి సేఫ్ గేమ్ ఆడుతున్నడని అందరు అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ రకమైన ఆటతో సందీప్ ఎన్ని రోజులు హౌస్ లో ఉంటాడనేది చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు