Chiranjeevi : భారతీయుడు చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ఎందుకు రిజెక్ట్ చేశాడు?

Chiranjeevi

ఇప్పుడు కోలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ సినిమాలు చాలా ఉన్నాయి. అందులో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్2కి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే, 27 ఏళ్ల క్రితం ఇండియన్ అనే టైటిల్ తో వచ్చిన ఒక సినిమా. ఇది కూడా కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిందే. ఈ సినిమాతో కమల్ హాసన్ యాక్టింగ్ లెవెల్ ఏంటో సినీ ప్రపంచానికి పరిచయమైంది. 1996లో వచ్చిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ గా ఇండియన్ 2 రాబోతుంది.

దీంతో అప్పుడు ఇండియన్ చిత్రాన్ని మిస్ అయినవాళ్లు, ఇప్పటికే చూసిన వాళ్లు మళ్లీ చూస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ చిత్రం సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన ఘటనను చర్చించుకుంటున్నారు. ఇండియన్ సినిమాను తమిళంలో కమల్ హాసన్ తో చేసినట్టే తెలుగులోనూ రీమేక్ చేయాలని డైరెక్టర్ శంకర్ భావించారట. ద్విభాష చిత్రంగా చేస్తే మరింత క్రేజ్ ఉంటుందని అనుకున్నాడట. ఈ క్రమంలో అప్పటికే టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న చిరంజీవిని ఇండియన్ స్టోరీతో సంప్రదించారట.

అంతే కాదు, కమల్ హాసన్ పై చిత్రీకరించిన కొన్ని సీన్స్ కూడా చూపించి పాత్ర గురించి చిరంజీవికి శంకర్ వివరించారట. చిరంజీవి ఇండియన్ స్టోరీ, పాత్ర బాగా నచ్చయట. కానీ, కమల్ హాసన్ యాక్టింగ్ చూసి, అలాంటి ఫర్మామెన్స్ తాను ఇవ్వలేనని శంకర్ కి చెప్పేశాడట. కమల్ హాసన్ యాక్టింగ్ ని మ్యాచ్ చేయడం కష్టమే అని, తానే కాదు, ఎవరు కూడా కమల్ హాసన్ లా ఫర్మామెన్స్ ఇవ్వలేరని శంకర్ కి చెప్పాడట.

- Advertisement -

దీంతో శంకర్ ఇండియన్ సినిమాను ద్వి భాషా చిత్రంగా చేయాలి అనే ఆలోచనను పక్కన పెట్టి, అన్ని భాషల్లో డబ్ చేయాలని డిసైడ్ అయ్యాడని టాక్. ఒక వేళ అప్పట్లో చిరంజీవి ఇండియన్ తెలుగు వర్షెన్ కి ఒప్పుకుంటే, టాలీవుడ్ లోనూ ఇండియన్ బిగ్ బ్లాక్ బస్టర్ అయ్యేది. ఇప్పుడు ఇండియన్ 2 పై కూడా భారీ అంచనాలు ఉండేవి

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు