Indian 2: శ్రీ వారి సన్నిధిలో ….

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్ 2. శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో కలువ కళ్ళ సుందరి కాజల్ అగర్వాల్ ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. బాబీ సింహ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్-రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిది స్టాలిన్-సుభాష్కరన్ నిర్మిస్తున్న ఇండియన్ 2 చిత్రానికి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఇండియన్ 2 లుక్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది.

అయితే, కమల్-శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ ఇటీవల చెన్నైలో జరిగింది. తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ తిరుపతిలో ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్ లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీనికోసం తిరుపతిలో బాగా ఖర్చుపెట్టి, సెట్ ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతోంది.

- Advertisement -

ఇండియన్ 2 సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా శంకర్ మరోవైపు రాంచరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న ఆర్ సి15 షూటింగ్ తో కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. కమల్ హాసన్ మరోవైపు మణిరత్నం డైరెక్షన్ లో 234వ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. మణిరత్నం, ఉదయనిది స్టాలిన్, కమల్ హాసన్ హోం బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు