Sai Pallavi: నాగ చైతన్య సినిమాకు సాయి పల్లవి మరీ అంత రెమ్యునరేషన్ తీసుకుంటోందా ?

Sai Pallavi

నాగ చైతన్య హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. గీత ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్, బన్నీ వాసు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన, సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తునట్టు ఇటీవలనే ప్రకటించారు. అయితే ఈ సినిమా కు సంబంధించి ప్రస్తుతం సాయి పల్లవి రెమ్యునరేషన్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే… హీరోయిన్ సాయి పల్లవి గత కొద్దీ రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఆమె చేస్తున్న సినిమాలేవీ బాక్స్ ఆఫీస్ వద్ద సరిగా ఆడకపోవుతుండటంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న, మొన్నటి వరకు ఆమె చేతిలో తమిళ్ హీరో శివ కార్తికేయన్ సినిమా తప్ప వేరే సినిమాలేవీ లేవు. ఇక లేటెస్ట్ గా ఆమె కమిటైన నాగ చైతన్య సినిమా కోసం సాయి పల్లవి కి భారీ రెమ్యునరేషన్ ముట్ట జెప్పబోతున్నరట ప్రొడ్యూసర్స్. ఇన్సైడ్ సమాచారం ప్రకారం ఆమె రెగ్యులర్ గా తీసుకునే రెమ్యునరేషన్ కంటే కూడా 40% ఎక్కువ మొత్తంలో పారితోషికం అందుకోనుందట.

అయితే మొదటగా నాగ చైతన్యతో సినిమా కోసం హీరోయిన్ కీర్తి సురేష్ ను అనుకున్నారు. కానీ కీర్తి సురేష్ తమిళ్ సినిమాలలో బిజీ గా ఉండటం వల్ల నాగ చైతన్య తో సినిమా చేయడానికి డేట్స్ కుదరకపోవడం వల్ల ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. దాంతో ఈ ఆఫర్ సాయి పల్లవి చెంతకు చేరింది. ఇక సాయి పల్లవి కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఆ క్యారెక్టర్ కు సూట్ అయ్యే హీరోయిన్ దొరకదేమో అనుకున్నాడో డైరెక్టర్ గాని.. మొత్తానికి సాయి పల్లవి అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి మాత్రం రెడీ అయ్యారుప్రొడ్యూసర్స్. అయితే సాయి పల్లవి కెరీర్ లోనే ఆమె అందుకుంటున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇదే నట. రోజు రోజుకు అంచనాలను పెంచేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మాత్రం అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు