Kangana Ranaut: పెళ్లి పీటలెక్కనున్న కంగనా…ముహూర్తం ఫిక్స్ ?

Kangana Ranaut

అందాలతార కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు కంగన రనౌత్ పేరు వినగానే ఆమె ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ముందుగా గుర్తుకు వస్తుంది. ఆ దూసుకుపోయే మనస్తత్వమే కంగానాను ఆ స్థాయికి తీసుకువచ్చిందని చెప్పవచ్చు. భారతదేశంలో అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న నటిగా కంగాన పలుమార్లు వార్తలో నిలిచింది.

నిత్యం వివాదాల్లో ఉంటుంది ఈ బ్యూటీ. ఎటు చూసినా కంగానా నైజమే ఓ ప్రత్యేకతను సంతరించుకుందని భావించవచ్చు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఏక్ నిరంజన్ చిత్రంతో తెలుగువారిని పలకరించింది కంగాన. ఆల్ ఇండియా లెవెల్ లో ‘సెక్సీని’గా సెగలు రేపింది. అయితే కంగానా ప్రస్తుతం బాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో బిజీగా ఉంది.

చంద్రముఖి-2తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే కంగానా పెళ్లికి సంబంధించి చాలా వార్తలు పుట్టుకొచ్చినప్పటికీ అందులో ఎలాంటి నిజాలు లేవు. అయితే తాజాగా సినీ విమర్శకుడు కె.ఆర్.కె కంగన రనౌత్ పెళ్లి గురించి చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘త్వరలోనే కంగన ప్రముఖ బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకోబోతుంది. డిసెంబర్ లో నిశ్చితార్థం. వచ్చే ఏడాది ఏప్రిల్ లో మ్యారేజ్ జరుగుతుంది. అడ్వాన్స్ గా హ్యాపీ వెడ్డింగ్ డే కంగానా జీ’ అంటూ ట్వీట్ లో రాసుకోవచ్చు. మరి దీనిపై కంగన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు