Kangana Ranaut: ప్రభాస్ నన్ను చాలా ఏడిపించేవాడు

Kangana Ranaut

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కంగనా రనౌత్, రాఘవ లారెన్స్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా చంద్రముఖి -2 సెప్టెంబర్ 28 న రిలీజ్ అవ్వబోతున్న సందర్భంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు మూవీ టీం. చంద్రముఖి 2 సినిమా గురించి పలు విషయాలపై ఆమె మీడియాతో మాట్లాడగా.. మీడియా వ్యక్తి ప్రభాస్ తో గతంలో పని చేయడం గురించి అడగటంతో ఆమె ప్రభాస్ పై కొన్ని సరదా వ్యాఖ్యలు చేసింది.

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న కంగనా రనౌత్, పాన్ ఇండియా ప్రభాస్ కలిసి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఏక్ నిరంజన్ అనే సినిమాలో నటించారు. 2009 లో వచ్చిన ఈ సినిమాతోనే కంగనా రనౌత్ మొదటి సారి సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమైంది. కానీ ఆ సినిమా సరిగా ఆడకపోవడంతో ఆ తరువాత మరేతర సౌత్ సినిమాలలోనూ ఆమె నటించింది లేదు. మళ్ళీ ఇన్నాళ్లకు కంగనా రనౌత్ చంద్రముఖి 2 సినిమాతో సౌత్ స్టార్ రాఘవ లారెన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆమెకు సౌత్ సినిమాలలో నటించాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టింది.

ఇక అలాగే ప్రభాస్ తో ఆమె నటించిన ఏక్ నిరంజన్ సినిమా రోజులను ఆమె గుర్తు చేసుకుంది. ప్రభాస్ గురించి ఆమె మాట్లాడుతూ “ప్రభాస్ నేను చాలా యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఏక్ నిరంజన్ సినిమాలో నటించాము.. షూటింగ్ సమయంలో మేము చాలా అల్లరి చేసేవాళ్ళము.. ఇద్దరం ఒకరికొకరం టీజ్ చేసుకునే వాళ్ళం.. చాలా సరదాగా ఆ సినిమా చేసాం. అయితే ఇప్పుడు ప్రభాస్ ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీ గా ఉంది. తనకు పాన్ ఇండియా వైడ్ క్రేజ్ రావడం చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది తనకు నా బెస్ట్ విషెస్ ” అంటూ కంగనా రనౌత్ ప్రభాస్ గురించి చెప్పుకొచ్చింది. అలాగే అవకాశం వస్తే తప్పకండా ప్రభాస్ తో నటిస్తానంటూ ఆమె తెలిపింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు